markopolo session 2 horses in war కోసం చిత్ర ఫలితం



భారతీయ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి వెండి తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 ది కంక్లూజన్ దేశ‌వ్యాప్తంగానే కాక విశ్వ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఆదరాభిమానాలు వరదలా పొంది నప్పటికీ అక్క‌డ‌క్క‌డ విమ‌ర్శ‌ల చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఈ సినిమా లోని ఒక దృశ్యానికి  హాలీవుడ్ సిరీస్ "మార్కొపోలో" లోని ఒక దృశ్యం స్ఫూర్తి అంటూ  వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.



కుంత‌ల దేశాన్ని శ‌త్ర‌వులు నుంచి కాపాడే క్ర‌మంలో ఎద్దుల కొమ్ముల‌కు గుడ్డ‌లు చుట్టి మంట అంటించి శ‌త్రువుల మీద‌కు
వదిలే సీన్‌కు "మార్కోపోలో సెష‌న్ 2" లో ఒక సీన్ స్ఫూర్తి అని నెట్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ సీన్‌ లో గుర్రాల‌కు మంట‌లు అంటించి వాటిని శ‌త్రువుల మీద‌కు వ‌దులుతారు సైనికులు. ఆసీన్‌నే రాజ‌మౌళి కాస్త మార్చి బాహుబ‌లి-2 లో వాడుకున్నారని కొంత‌ మంది నెటిజ‌న్లు ఆరోపిస్తున్నారు. 


సంబంధిత చిత్రం



కాగా, గేదెల కొమ్ముల‌కు గోనే సంచులు చుట్టి నిప్పు అంటించి శ‌త్రువుల మీద‌కు తోలటమనేది పురాత‌న యుద్ద క్షెత్రాల్లో చాలా మంది రాజులు ఉప‌యోగించిన యుద్ద విధానం భారత్ లో ఉండేదని, దాన్నే రాజ‌మౌళి ఎద్దులకు కట్టి చూపించాడ‌ని మ‌రికొంత మంది అంటున్నారు. బహుశ యుద్ద విద్యలు కాపీ కొట్టి "మార్కోపోలో- సెష‌న్ 2" లో ఉపయోగించి ఉంటారు. మనమే వారికి స్పూర్తి అంటే సరిపోతుంది కదా! 



markopolo session 2 horses in war కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: