ఎవ‌డ్ హీరోయిన్ అమీ జాక్సన్ కు పెద్ద ప్రమాదం త‌ప్పింది. ఇంగ్లాండ్ లోని జ‌రిగిన కారు ప్రమాదంలో గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది .రెండు కార్లు గుద్దుకోగా అమీ కారుని డేష్ ఇచ్చిన వ్యక్తి ప‌రిస్ధితి విష‌మంగా వుంది. అయితే అమీ మాత్రం మ‌రో మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతుంద‌ని స‌మాచారం.

ఇక ఇంగ్లాండులోని లివ‌ర్ పూల్ నుండి కారులో వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది. అయితే యాక్సిడెంట్ అయిన త‌రువాత అమీ విషయం ఎవ‌రికీ తెలియ‌కుండా హ‌స్పిట‌ల్ కి వెళ్లింది. డాక్టర్లు ప్రమాద‌మేమీ లేద‌ని రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే స‌రిపోద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.

విశేషం ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు త‌న‌కి చాలా జ‌రిగాయ‌ని, జ‌స్ట్ లో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టం త‌న‌కి అల‌వాటే అంటోంది ఈ 21ఏళ్ల బ్రిట‌న్ సుందరి. ఏక్ దీవానా ధాతో ఎంట్రీ ఇచ్చి కోలీవుడ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ సుందరి ఇపుడు చెర్రికి జోడిగా ఎవడుతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్రమాదం నుండి బ‌య‌ట‌ప‌డిన అమీ త్వర‌గా కోలుకోవాల‌ని ఎవడు సినిమా టీం కోరుకుంటూ ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: