చేతిలో హిట్లు లేక‌పోయినా ప్ర‌యోగాలు చేయ‌డానికి స‌దా సిద్ధంగా ఉంటాడు విక్ర‌మ్‌. దానితో పాటు గెట‌ప్పుల మీద మోజు కూడా ఎక్కువే. అప‌రిచితుడు సినిమాలో నాలుగు అవ‌తారాల్లో క‌నిపించాడు. నాన్న‌లో క‌మ‌ల్‌హాస‌న్ రేంజు న‌ట‌న చూపించాడు. శంక‌ర్ ఐ సినిమాలోనూ అదే పంథాలో వెళ్తున్నాడు.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఐ. తెలుగులో మ‌నోహ‌రుడుగా వ‌స్తోంది. ఈ సినిమాలోనూ విక్ర‌మ్ ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో క‌నిపిస్తాడ‌ట‌. ప‌తాక స‌న్నివేశాల్లో 85యేళ్ల వృద్ధుడిగా న‌టించ‌బోతున్నాడు. ఈ పాత్ర‌కు మేక‌ప్ చేయ‌డానికి అమెరికా నుంచి ఓ ప్ర‌త్యేక బృందం కూడా వ‌చ్చింద‌ట‌. విక్ర‌మ్ ముస‌లివాడిగా ఎందుకు మారాడు? ఎలా మారాడు? అనేదే ఈ క‌థ‌లో కీ పాయింట్ అని తెలిసింది.

ఈ సినిమాలో విక్ర‌మ్ బాక్సర్‌గా క‌నిపిస్తాడు. అందుకోసం ఏకంగా 12 కిలోల బ‌రువు త‌గ్గాడ‌ట‌. ఈ సినిమా కోసం ఇదివ‌ర‌కు ఎప్పుడూ లేనంత క‌ష్ట‌ప‌డిన విక్ర‌మ్‌కి త‌గిన ఫ‌లితం వ‌స్తుందో లేదో చూడాలి. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: