ఎటువంటి  టాప్ దర్శకుడు అయినా మెగా కాంపౌండ్ స్కెచ్ కి పడి తీరుతాడు అని అంటారు. దీనికి ఉదాహరణగా నేటి ఇండియన్ సూపర్ స్టార్ గా పరిగణింపబడుతున్న రాజమౌళి విషయాన్ని పేర్కొనవచ్చు. ప్రస్తుతం హిమాలయాల దేశం భూటాన్ లో రాజమౌళి ప్రశాంతంగా అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ హాలిడే ట్రిప్ రాజమౌళి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి ఇండియాలో లేకపోయినా ఆయనతో సినిమా చేసేందుకు ఎవరి పైరవీలు వారు చేసుకుంటున్నారు. ఈ పైరవీల కోసం ఏకంగా రాఘవేంద్రరావు కీరవాణి విజయేంద్ర ప్రసాద్ లను దూతలుగా వాడుతున్నట్లు ఇప్పటికే గాసిప్పులు వచ్చాయి. 

అయితే ఇప్పుడు ఈ లాబీయింగ్ లోకి ఏకంగా మెగా కాంపౌండ్ కూడ వచ్చి చేరింది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.  కానీ మెగా కాంపౌండ్ తో రాజమౌళికి సన్నిహిత సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. రామ్ చరణ్ తో ‘మగధీర’ సినిమా చేస్తున్న టైమ్ లోనే రాజమౌళికి నిర్మాత అల్లు అరవింద్ కు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయనే గాసిప్పులు హడావిడి చేసాయి.   

దీనికి బలం చేకూరుస్తు మగధీర తర్వాత మళ్లీ మెగా కాంపౌండ్ వైపు రాజమౌళి కన్నెత్తి చూడలేదనే విషయం అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయిన నేపధ్యంలో జక్కన్న దృష్టిని మెగా కాంపౌండ్ వైపు తీసుకు వచ్చే బాధ్యతను స్వయంగా చిరంజీవి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ విషయంలో అల్లు అరవింద్ రంగంలోకి దిగితే పని జరగదని భావించిన చిరంజీవి స్వయంగా తనే విషయాన్ని సెటిల్ చేసే పనిలో రాయబారాన్ని మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ ప్రాజెక్ట్ తరువాత గ్రాఫిక్స్ హడావిడి లేకుండా ఒక సాధారణ కమర్షియల్ సినిమా తీయాలి అన్న ఆలోచనలలో రాజమౌళి ఉన్న విషయాన్ని పసిగట్టిన చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ లతో ఒక పక్కా మాస్ మల్టీ స్టారర్ మూవీని నిర్మించమని చిరంజీవి రాజమౌళి పై వ్యూహాత్మక ఒత్తిడిని అప్పుడే మొదలు పెట్టినట్లు టాక్. దీనితో ఈ వ్యూహాలకు రాజమౌళి ఎలాంటి తెలివైన సమాధానం ఇస్త్తాడు అన్న ఆసక్తి ఫిలింనగర్ వర్గాలలో ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: