సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలే ఎక్కువ కనిపిస్తాయి.  అయితే కొంత మంది ఇప్పటికీ కలిసి మెలిసి ఉండగా..కొంత మంది మాత్రం విడాకులు తీసుకుని స్వేచ్చగా జీవిస్తున్నారు.  సినిమా ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కుటుంబంలో ఇప్పుడు ఓ జంట అధికారికంగా విడిపోయారు.  సల్మాన్ సోదరుడైన అర్భాజ్ ఖాన్ సినీ నటి మలైకా అరోరా తమ 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. కాగా ముంబైలోని బాంద్రా కోర్టు వీరిద్దరికీ నిన్న అధికారికంగా విడాకుల నోటీసు జారీ చేసింది.  
Image result for malaika arora arbaaz khan
సాదారణంగా విడాకులు తీసుకున్న సమయంలో భర్త నుంచి ఎంతో అంత భరణం తీసుకోవడం చాలా మంది చేస్తూ ఉంటారు..కానీ మలైకా అరోరా మాత్రం  పైసా భరణం కూడా అడగలేదట. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.
Image result for malaika arora arbaaz khan
బాలీవుడ్ లో ప్రేమ జంటలు విడిపోయిన తర్వాత తమ భర్త ల నుంచి కోట్లాది రూపాయలు  భరణంగా తీసుకున్నవారు కూడా ఉన్నారు.   ఆ మద్య తన భార్య సుసానేకు ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ భరణం కింద రూ. 200 కోట్లు ఇచ్చాడు. అయితే, మలైకా మాత్రం భరణం అడగకపోవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: