యువ హీరోల్లో విభిన్న కథలతో వరుస విజయాలను అందుకుంటున్న నిఖిల్ నిన్న వచ్చిన కేశవ సినిమాతో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. సుధీర్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నిఖిల్ నటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఎంతో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో నిఖిల్ ఆడియెన్స్ మనసులను గెలిచేశాడు.


ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ సీక్వల్ గా కార్తికేయ-2 మూవీ చేసే ప్రయత్నంలో ఉన్న నిఖిల్ తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తుంది. నిన్న మొన్నటిదాకా కోటి నుండి 2 కోట్ల దాకా ఉన్న నిఖిల్ ఇక నుండి తనతో సినిమా అంటే 3 కోట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడట. 


స్వామిరారా సినిమా ముందు దాకా రొటీన్ సినిమాలతో విసుగుతెప్పించేసిన నిఖిల్ ఒక్కసారిగా తనలో మార్పు తెచ్చుకుని కొత్త కథలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే చేస్తున్న ప్రతి సినిమా హిట్ టార్గెట్ పెట్టుకుంటూ టార్గెట్ మిస్ అవ్వకుండా సూపర్ హిట్ అందుకుంటూ వస్తున్నాడు. 


లాస్ట్ ఇయర్ డీమానిటైజేషన్ టైంలో కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకుని పరిశ్రమ పెద్దలను కూడా అవాక్కయ్యేలా చేసిన నిఖిల్ తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. డిఫరెంట్ అటెంప్టులతో వస్తున్న నిఖిల్ సినిమాలు దాదాపు 20 కోట్ల దాకా వసూళ్లను రాబడుతున్నాయి. ఈ లెక్కన నిఖిల్ 3 కోట్లు డిమాండ్ చేయడంలో తప్పేం లేదనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: