విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలలోని నటనే కాదు తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. తాను అనుకున్న మాటలు, భావాలు ఏమి దాచుకోకుండా మాట్లాడడం, తాను ఎలా జీవించాలి అని అనుకుంటాడో అలాగే జీవించడం ప్రకాష్ రాజ్ ప్రత్యేకత. సినిమాలలో తండ్రి గా, అన్న గా, అండర్ వరల్డ్ డాన్ గా, భర్త గా ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి, మెప్పించిన ప్రకాష్ రాజ్ కు తన చిన్నతనం నుండి ఒక విచిత్రమైన కోరిక ఉందట.

ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కొనుక్కొని, ఆ వ్యవసాయ క్షేత్రంలో తన సొంత ట్రాక్టర్ తో తానే డ్రైవ్ చేసుకుంటూ, తన వ్యవసాయ క్షేత్రాన్ని దున్ని వ్యవసాయం చెయ్యాలనే కోరిక ఉందట ఆయనకి. ఈమధ్యనే హైదరాబాద్ చివర ఒక వ్యవసాయ క్షేత్రాన్ని, మరొక కొత్త ట్రాక్టర్ ను కొనుక్కొని, ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా నేర్చుకొని తనకు తానుగా వ్యవసాయ పనులు చేస్తూ తన చిన్ననాటి కోరికను తీర్చుకున్నాడట మన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇంతటి విభిన్న వ్యక్తిత్వం ఉంది కాబట్టే నగ్నంగా నటించి కూడా తన సత్తా ఏమిటో టాలీవుడ్ కు చూపించాడు ప్రకాష్ రాజ్. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ చిన్ననాటి కోరిక నేడు నెరవేరినందుకు ప్రస్తుతం ఆయన మంచి జోష్ మీద ఉన్నాడట.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: