తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారుసడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తాజాగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  ఈ సంవత్సరం ‘ప్రేమమ్’ చిత్రంతో మంచి విజయం అందుకున్న చైతూకి ఈ చిత్రం మంచి బూస్టింగ్ ఇచ్చింది.  గత పది సంవత్సరాల నుంచి పెద్ద హిట్స్ ఏమీ లేని నాగచైతన్య ప్రేమమ్ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  నిన్న రిలీజ్ అయిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ మంచి కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కింది.  
Image result for rarandoi veduka chuddam stills
అక్కినేని నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకులు కల్యాన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.  నాగా చైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ సినిమా తొలి రోజు మంచి షేర్ నమోదు చేసింది. థియేటర్ అడ్వాన్స్ లు, ఇతరత్రా వ్యవహారాలు ఏవీ కలపకుండా తొలి రోజు మూడు కోట్ల నలభై లక్షలు షేర్ సాధించింది. ఈ సినిమాను దాదాపు అన్ని ఏరియాల్లో అన్నపూర్ణ సంస్థే నేరుగా పంపిణీ చేసుకుంది.
Image result for rarandoi veduka chuddam stills
ఈస్ట్ గోదావరికి అనిల్ సుంకర కొటి ఇరవై లక్షలకు కొనుగోలు చేసారు. అదే ఈస్ట్ గోదావరిలో తొలి రోజు 31 లక్షలు షేర్ వచ్చింది. గతవారం విడుదలైన కేశవ కు ఈస్ట్ లో తొలి రోజు వచ్చిన షేర్ 11 లక్షలే. కేశవ కు నైజాంలో 60 లక్షలు షేర్ వస్తే, రారండోయ్ కు కొటి పదిలక్షల వరకు షేర్ వచ్చింది. నాగచైతన్య లేటెస్ట్ హిట్ ప్రేమమ్ 25 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. రారండోయ్ సినిమా ఆ ఫిగర్ ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Image result for rarandoi veduka chuddam stills

‘రారండోయ్ వేడుక చూద్దం’ ఫస్ట్ డే కలెక్షన్లు ఏరియా వైజ్ వివరాలు :


నైజాం ....................................... 1.10 కోట్లు


ఉత్తరాంథ్ర .................................... 44 లక్షలు


ఈస్ట్ ........................................... 35 లక్షలు


కృష్ణ ............................................ 28 లక్షలు


గుంటూరు ...................................... 37లక్షలు


నెల్లూరు ......................................... 11 లక్షలు


వెస్ట్ ............................................... 28 లక్షలు


సీడెడ్ ............................................... 52లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: