షారుఖ్ లెటెస్ట్ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉండ‌టంతో ఈ గ్యాప్‌లో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు ఈ కింగ్‌ఖాన్‌. త‌రువాత ఏం చేయ‌బోతున్నాడు అంటే త‌న నెక్ట్స్ ఫిల్మ్‌కు గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. చెన్నైఎక్స్‌ప్రెక్ మూవీకు ముందుగానే త‌రువాత ఫిల్మ్‌ను ఫ‌రాఖాన్‌తో చేస్తున్నట్టు షార‌ఖ్ ఎనౌన్స్‌ చేశాడు.

ఆ మూవీ పేరే హ్యాపీ న్యూ ఇయ‌ర్‌.  ఈ మూవీకు సంబంధించిన షారుఖ్ రోల్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇందులో షారుఖ్ సైకో ల‌వ‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. ఫ‌రాఖాన్‌తో షారుక్‌కు ఎప్పటి నుండో మంచి రిలేష‌న్ కొన‌సాగుతుంది. దాదాపు 10 సంవ‌త్సరాలుగా వీరిద్దరి మ‌ద్య రిలేష‌న్స్ ఉన్నాయి. అందుకే ఓం శాంతి ఓం మూవీకు ఫ‌రాఖాన్‌కు అవ‌కాశం ఇచ్చాడు.

చాలా లాంగ్ గ్యాప్ త‌రువాత మ‌ళ్ళీ విరిద్దరి కాంబినేష‌న్‌లో హ్యాపి న్యూ ఇయ‌ర్ మూవీ తెర‌కెక్కుతుంది. ఇందులోనూ దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా కొన‌సాగ‌టానికి ఛాన్స్ ఉంద‌ని బి-టౌన్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: