తెలుగు ఇండస్ట్రీలో కి ఇతమ భాషలకు చెందిన హీరోయిన్లు చాలా మంది ఎంట్రీ ఇచ్చారు..మంచి సక్సెస్ అందుకున్నారు.  ముఖ్యంగా  మాలీవుడ్ కి చెందిన హీరోయిన్లు  ఎంతో మంది తెలుగులో అద్భుతమైన విజయాలు అందుకున్నారు.  తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా మంచి విజయాలు అందుకున్నారు.  తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ  ఇచ్చింది..సమంత.  తర్వాత అగ్ర హీరోల సరసన నటించి సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది.

Image result for samantha hot pics

ఒకదశలో యంగ్ హీరోల సరసన సమంత తప్ప ఎవ్వరూ పనికిరారు అన్న స్థాయికి చేరింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా బిజీ హీరోయిన్ గా ఎదిగింది.  సమంత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది.  ఈ అమ్మడు ‘ఏం మాయ చేశావే’ చిత్రం సహనటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడింది.  వీరి పెళ్లికి పెద్దలు కూడా ఓకే చెప్పడం..నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.  త్వరలో వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.


ఇప్పటికే మెగాస్టార్ తనయుడు రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.  రాజుగారి గది 2 చిత్రంలో తన మామ నాగ్ తో కలిసి నటిస్తుంది.  ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత నాగచైతన్య, సమంత వివాహం చేసుకోబోతున్నారు.  అయితే సమంత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు మోడల్ గా కొన్ని యాడ్స్ లో నటించింది.  దానికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: