ఈషా రెబ్బ నటన , ఎంటర్టైన్మెంట్ఈషా రెబ్బ నటన , ఎంటర్టైన్మెంట్రొటీన్ కథ కథనాలు
అనంత్ (అడివి శేష్), దీపిక (ఈషా రెబ్బ) ప్రేమించుకుంటారు. కోటిశ్వరుడైన దీపిక తండ్రి తణికెళ్ల భరణి వీరి ప్రేమను ఒప్పుకోడు. ఇక దీపిక అన్నయ్య విజయ్ (అవసరాల శ్రీనివాస్) మాయ (అదితి మ్యాకల్)ను ప్రేమిస్తాడు. తండ్రిని కాదని దీపిక అనంత్ ను, విజయ్ మాయని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దీపికని తణికెళ్ల భరణి ఇంట్లో బంధించగా పనిమనిషి కుమారి (శ్యామలాదేవి) సహాయంతో బయట పడుతుంది. ఈలోపే దీపికను పెళ్లి చేసుకునేందుకు వచ్చిన శ్రీ చిలిపి (వెన్నెల కిశోర్) కుమారిని చూసి పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. ఇంతకీ అనంత్ దీపికా, విజయ్-మాయల ప్రేమ గెలిచిందా..? డబ్బు వ్యామోహంతో శ్రీ చిలిపి ఎలా బుక్ అయ్యాడు..? చివరగా దీపికా విజయ్ తండ్రి వారి ప్రేమను ఒప్పుకున్నాడా లేదా అన్నది అసలు కథ.

అనంత్ గా అడివి శేష్, దీపికగా ఈషా రెబ్బ నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ గా అవసరాల పాత్ర చిన్నదే అని చెప్పొచ్చు. క్యారక్టర్స్ మొత్తం తెలంగాణా యాసలో మాట్లాడటం విశేషం. మాయగా అదితి మ్యాకల్ ఇంప్రెస్ చేసింది. అయితే క్యారక్టర్ ఏవి సీరియస్ నోట్ తో కనిపించవు. సినిమాలో వెన్నెల కిశోర్ కామెడీ బాగుంటుంది. శ్రీ చిలిపిగా వెన్నెల కిశోర్ సినిమాలో చాలా స్కోప్ దొరికింది. డైరక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసి ఇంప్రెస్ చేశాడు వెన్నెల కిశోర్. ఇక తణికెళ్ల భరణి నటన మిగతా క్యారక్టర్ ఆర్టిస్ట్ ల నటన పర్వాలేదు అన్నట్టు ఉంది.

అమీ తుమీ అని వచ్చిన ఈ సినిమా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో వచ్చింది. సినిమా అంతా ఎంటర్టైనింగ్ మోడ్ లో నడిపించిన డైరక్టర్ కథ కథనాలు అంత సీరియస్ గా చూపించలేదు. సినిమా అంతా కామెడీగా నడిపించి ఎంటర్టైన్ చేసినా థియేటర్ నుండి బయటకు రాగానే సినిమాలో విషయం ఏం లేదని అనిపిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. కెమెరా వర్క్ పర్వాలేదు. డైలాగ్స్ కూడా ముఖ్యంగా తెలంగాణా యాసలో బాగా రాశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.   

జెంటిల్మన్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ అడివి శేష్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్ తో చేసిన సినిమా అమీ తుమీ. సినిమా మొత్తం కామెడీ కోసమే అన్నట్టు ఉంటుంది. కథ అంతా సీరియస్ నోట్ అనిపించదు. కథనం కూడా ఇప్పటికే చాలా సార్లు చూసిన భావన వస్తుంది. పాత కథ కథనాలకే అడివి శేష్, అవసరలా వంటి కొత్త పాత్రలతో చూపించారనిపిస్తుంది.  

సినిమా మొత్తం వెన్నెల కిశోర్ కామెడీ మీద నడిపించాలని చూశారు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదు అన్నట్టు ఉన్నా సెకండ్ హాఫ్ లో మాత్రం బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ బాగుంది. సినిమా ఎక్కడ సీరియస్ గా అనిపించదు. సినిమాలో శ్యామలాదేవి పాత్ర ఎక్కువగా ఉండటం ఆకట్టుకుంటుంది. 

కథ కథనాల్లో కొత్తదనం లేకపోయినా సినిమా చూస్తున్నంత సేపు సరదాగా అనిపిస్తుంది. చూస్తున్నంత సేపు ఏమాత్రం బోర్ కొట్టకుండా కథనం ఉంటుంది. అయితే కథనంలో ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండి ఉంటే బాగుండేది. కథ ఫ్లాట్ గా అనిపించడం సన్నివేశాలు అన్ని ముందే ఊహించేలా ఉంటాయి. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. 

జెంటిల్ మన్ లాంటి ఇంటెన్స్ ఉన్న సినిమా తీసిన డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్న ఇలాంటి కథ కథనం సరిగా లేని కేవలం కామెడీనే నమ్ముకునే సినిమా తీస్తాడని ఊహించి ఉండరు. లొకేషన్స్ కూడా అంత రిచ్ గా ఏమి ఉండవు. సినిమా అంతా లిమిటెడ్ బడ్జెట్ లోనే ముగించినట్టు కనిపిస్తుంది.  



Avasarala Srinivas,Adivi Sesh,Eesha Rebba,Mohan Krishna Indraganti,K C Narasimha Rao,Mani Sharmaరొటీన్ కామెడీతో అమీ తుమీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: