పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెళ్లి, ప్రేమ మొదలగు వాటిపై ఎటువంటి అభిప్రాయం ఉందో అందరికి తెలిసిన విషయమే. సహజీవనం అంటే ఇష్టపడే పవన్, రెండు సార్లు పెళ్లి చేసుకున్నా, ఆ పెళ్లి ని మూడునాళ్ళ ముచ్చట గానే మిగుల్చుకోగాలిగాడు తప్ప నిండు నూరేళ్ళు జీవితంగా మాత్రం మార్చుకోలేక పోయాడు. పవన్ విషయం పక్కన పెడితే ఇప్పుడు పవన్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ పెళ్లి, ప్రేమ ల విషయం లో పవన్ దారిలోనే పయనిస్తుంది.


పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెబుతున్న శృతి, పెళ్ళి పై మాత్రం ఇంటరెస్ట్ లేదంటుంది. అంతగా కావాలంటే పిల్లలను కంటాను తప్ప పెళ్లి మాత్రం చేసుకోను అని ఖరాఖండీగా చెప్పేసింది శృతి హాసన్. పెళ్లి వద్దు పిల్లలు మాత్రమే ముద్దు అని చెబుతుంది అంటే సహజీవనం కి ఓటేసినట్లేగా!అంతే కాదు పెళ్లి చేసుకుంటే వచేవాడు ఎం ఆశించి పెళ్లి చేసుకుంటాడో నాకు తెలుసు. భవిష్యత్తు లో నా ఆలోచనలో మార్పు వస్తే తప్ప ఇప్పట్లో నాకు మాత్రం పెళ్లి ఆలోచన లేదని చెప్పేసింది శృతి.


పవన్ కూడా ఇలాంటి అభిప్రాయం తో ఉన్నాడు కాబట్టే అతనికి పెళ్లి కలిసి రాలేదు. నిజంగా అతను చేసుకున్న రెండో పెళ్లి అతని ఇష్టం తో కాకుండా ప్రజారాజ్యం పార్టీ కోసం జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఆ పెళ్లి కూడా కలకాలం నిలవలేక పోయింది. పెళ్లి పై శృతి చెబుతున్న విషయాలు చూస్తుంటే శృతి పవన్ని ఉదాహరణ గా చూపిస్తుందా అనే అనుమానం ఆమె డిసిషన్ తెలిసిన ఎవరికైనా వస్తుంది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: