బాలీవుడ్ మూవీ కహాని మూవీ కి రీమేక్ గా రూపొందుతున్న అనామిక చిత్రం లో నయనతార ని శేఖర్ కమ్ముల గర్భవతిని చేయడం లేదు. మీనింగ్ లో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కదా! శేఖర్ కమ్ముల చేస్తున్న కహాని రీమేక్ అనామిక లో, కహాని లో విద్యాబాలన్ లా కాకుండా అనామిక లో నయనతార ని సరికొత్తగా చుపించబోతున్నాడు శేఖర్ కమ్ముల.


గర్భవతి గా ఆ మూవీ లో విద్యాబాలన్ మొగుడి ని వెతుక్కుంటే, ఈ అనామిక లో మాత్రం నయనతార నార్మల్ గానే మొగుడుని వెతుకుతుందట. ఈ మూవీ లో నయనతార కి హస్బెండ్ గా హర్సవర్ధన్ చేస్తున్నాడు. కహాని మూవీని తమిళ్, తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చిన శేఖర్ కమ్ముల, ఈ మూవీ లో నయనతార స్వరూపాన్నే మార్చేసాడు.


అయిన గర్భవతి గా కనిపిస్తే నయనతార ని ఎవ్వరు చూడరని తెలిసే శేఖర్ కమ్ముల ఈ మార్పు చేసాడో లేక నయనతారే గర్భవతి గా ఆయితే చేయనని చెప్పిందో తెలియదు కాని నయనతార ని మాత్రం శేఖర్ కమ్ముల గర్భవతి ని చేయడం లేదు. మరి ఆ పాత్రే కహాని కి ప్రాణం పోసింది. మరి గర్భవతి కాకుండా మార్పు చేసాడంటే శేఖర్ ఎ విదంగా మార్పు చేసి ఉంటాడో అనేది కూడా ఈ మూవీ పై ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: