అల్లు అర్జున్ నిన్న జరిగిన ‘దువ్వాడ జగన్నాథం’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తనకు అమ్మాయిలలో బాగా నచ్చే రెండు లక్షణాలను బయట పెట్టాడు. తనకు అమ్మాయిలో ఉన్న అందంకన్నా ఆమెలో ఉండే నవ్వు హూందాతనం తనకు బాగా ఇష్టం అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఇటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలతో నటించడానికి తాను ఇష్టపడతాను అంటూ తన హీరోయిన్స్ ఎంపిక వెనుక సీక్రెట్ బయట పెట్టాడు. ఈ రెండు లక్షణాలు పూజ హెగ్డేలో బాగా ఉన్నాయి అంటూ ఈసినిమా విడుదల తరువాత పూజ హెగ్డే టాప్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అంటూ జోశ్యం చెప్పాడు.  

అంతేకాదు దర్శకుడు హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ ఎవరైనా హీరోయిన్ పువ్వులా చూసుకుంటారని అయితే తనను హరీష్ శంకర్ పువ్వులా చూసుకున్నాడు అంటూ జోక్ చేసాడు. అదేవిధంగా హరీష్ శంకర్ టేకింగ్ స్క్రీన్ ప్లే ఈసినిమాకు ఆయువుపట్టుగా మారుతుందని అందువల్ల ‘దువ్వాడ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నాడు. 

మెగా కుటుంబంలో ఒక హీరోయిన్ ఎవరికైనా నచ్చితే చాలు ఆ హీరోయిన్ ను మెగా యంగ్ హీరోలు అందరూ ప్రోత్సహిస్తూ ఆమెను టాప్ రేంజ్ కి తీసుకువెళ్ళిపోతున్న నేపధ్యంలో పూజ హెగ్డే బన్నీ మనసుకు నచ్చడంతో త్వరలోనే చరణ్ తదితర హీరోలతో నటించడం ఖాయం అనుకోవాలి. ‘దువ్వాడ’ విడుదల కాకుండానే కోటి రూపాయల హీరోయిన్ గా మారిపోయిన పూజ హెగ్డే ఈ మూవీ విడుదల తరువాత టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరడం ఖాయం అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: