తమిళ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి ధన్సిక. పేరాన్మమై సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమాలో జయం రవితో చాలా మంది హీరోయిన్స్ ఉన్నా ధన్సికకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అందుకే ఆమెకు లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కబాలి సినిమాలో రజిని కూతురిగా అద్భుతమైన అభినయం కనబరచింది ధన్సిక.


కబాలి సినిమాకు ధన్సిక సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సైతం దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఉరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధన్సిక ఆ సినిమా హిట్ అవడంతో అమ్మడు సంతోషంగా ఉంది. ఆ సినిమా సక్సెస్ జోష్ తోనే తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలో చాలా రిస్కీ షాట్స్ సైతం చేయాల్సి వచ్చింది. 


యాక్షన్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాల్లో కూడా తాను నటించేందుకు రెడీ అంటుంది ధన్సిక. అంతేకాదు తాను ఎలాంటి పాత్ర చేసేందుకైనా సిద్ధమే అంటుంది ధన్సిక. తమిళ అమ్మాయి సహజ నటనతో ఆకట్టుకుంటున్న ధన్సిక అవకాశం వస్తే ఏ భాషలో అయినా నటిస్తా అంటుంది.


హీరోయిన్స్ కొరతగా ఉన్న సౌత్ లో ధన్సిక తన టాలెంట్ తో అదిరిపోయే అవకాశాలను అందుకుంటుంది. స్టార్ క్రేజ్ వచ్చేదాకా అమ్మడు ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న ధన్సిక తెలుగులో కూడా నటిస్తా అని చెప్పడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: