అత్యంత భారీ అంచనాలతో నేడు విడుదల అయిన ‘దువ్వాడ జగన్నాథం’ కు సంబంధించి మొట్టమొదటి ఎర్లీ టాక్ బయటకు వచ్చింది. కామెడీ, యాక్షన్ అంశాలను మేళవించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్న భూముల స్కాం పాయింట్ ను కథా వస్తువుగా తీసుకుని దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ప్రయత్నమే ‘దువ్వాడ జగన్నాధం’ అని అంటున్నారు. 

ఈ మూవీకి డీసెంట్ కామెడీ ప్రధాన ఆకర్షణగా మారి ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు మన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కామ్‌ ను గుర్తుకు చేసేదిగా ఉందని కామెంట్స్  వస్తున్నాయి. ప్రేక్షకులను ఆహ్లాద పరిచే విధంగా క్లైమాక్స్ లో భారీ ఫైట్స్ లేకుండా హాస్యంతో క్లైమాక్స్ ను నడిపించడం సగటు మాస్ ప్రేక్షకుడుకి ఎంత వరకు రీచ్ అవుతుంది అన్న అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 

విజయవాడ కేంద్రంగా కొందరు నేతలు బ్రహ్మణ సంఘానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలువచ్చిన నేపధ్యంలోని పాయింట్ కూడ ఈ మూవీ కథలో కనిపించడంతో ప్రస్తుతం రాజకీయాలను కుదిపేస్తున్న అనేక సంఘటనలు బ్యాక్ డ్రాప్ గా ఈసినిమాను తీసారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా జరిగిన కొన్ని భూదందాలు కూడ ఈసినిమా తీసిన వారికి గుర్తుకు వస్తాయి.

అయితే ఈమధ్య కాలంలో పత్రికలలో వచ్చిన రకరకాల స్కాంలను కథగా మార్చి దానికి హాస్యాన్ని జోడించి చేసిన ప్రయోగమే ఈ ‘దువ్వాడ జగన్నాథం’ అయితే హరీష్ శంకర్ వ్రాసిన డైలాగ్స్ తెరపై తూటాలు పెలుతున్నట్లు టాక్. ముఖ్యంగా ఒక సీన్లో ‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు' అంటూ చెప్పే డైలాగ్స్‌ కు ప్రేక్షకులకు మంచి స్పందన వస్తోంది అని తెలుస్తోంది. 

ముఖ్యంగా సభ్య సమాజానికి ఏం చెబుతామనుకొంటున్నావ్ లాంటి డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకునే ఆస్కారం ఉంది. సీరియస్ సన్నివేశాలలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ తూటాలులా పేలినా బ్రహ్మణ యాసపై అల్లుఅర్జున్ ఇంకా దృష్టిపెడితే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు అల్లు అర్జున్ కామెడీ పూజ హెగ్డే గ్లామర్ తప్ప మరే కొత్తదనం లేకపోవడంతో పాత పేపర్లలోని వార్తలను తీరికగా తిరగవేసినట్లుగా ఉంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ‘దువ్వాడ’ హిట్ అవుతుంది కానీ బ్లాక్ బస్టర్ హిట్ కు అవకాశం లేదు అనేది ఈసినిమాకు సంబంధించి ప్రస్తుతం బయట వినిపిస్తున్న ఎర్లీ టాక్. మరి ముందుముందు ఎలా టర్నింగ్ తీసుకుంటుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: