తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే హరికృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత విషయాలు చూసుకుంటూ సినిమాలకు దూరమయ్యారు.  బాలకృష్ణ హీరోగా కంటిన్యూ అవుతూ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఇప్పటి వరకు వంద చిత్రాల్లో నటించిన బాలయ్య ప్రస్తుతం 101 వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ చిత్రంలో నటిస్తున్నారు.
First look of Nandamuri Kalyan Ram starrer MLA is out now
అయితే నందమూరి హరికృష్ణ తనయులు జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు.  అయితే కళ్యాన్ రామ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..నిర్మాణ రంగంలో తన ప్రత్యేకత చాటుకున్నాడు.  ప్రస్తుతం తన తమ్ముడు ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రానికి నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు.  ఈ రోజు నందమూరి కళ్యాన్ రామ్ పుట్టి రోజు...ఇక తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ ను వెనుక నుంచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన జూనియర్ నందమూరి తారకరామరావు... "పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా" అంటూ విషెస్ చెప్పాడు.  
Image result for harikrishna ntr kalyan ram
కల్యాణ్ రామ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిన్న సాయంత్రం అతని తాజా సినిమా 'ఎమ్ఎల్ఏ' (మంచి లక్షణాలున్న అబ్బాయి) ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరోసారి కాజల్ కళ్యాణ్ రామ్ తో నటించనుంది. కాగా, కాజల్ తొలి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'లో కలిసి నటించారు.  జూనియర్ ఎన్టీఆర్ విష్ చేసిన కాసేపటికే కల్యాణ్ రామ్ కు అభిమానుల నుంచి విషెష్ వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కళ్యాన్ రామ్ కి ఏపీహెరాల్డ్.కామ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: