ఆ మద్య మళియాళ హీరోయిన్ భావన పై ఆమె కారు డ్రైవర్  కిడ్నాప్ చేసి అత్యాచార యత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భావన వెనుకంజ వేయకుండా నింధితులకు జైలు శిక్ష పడే వరకు పోరాడింది.  అయితే ఆమెను స్ఫూర్తిగా తీసుకొని కొంత మంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపులపై నోరు విప్పారు.  కొంత మంది దర్శక, నిర్మాతలు హీరోయిన్ చాన్స్ కోసం ఎదురు చూసే వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తారని..అలా లొంగిన వారికి సినిమా చాన్సులు ఇస్తారని..లేదంటే ఇండస్ట్రీల చాలా ఇబ్బందులు పెడతారని కామెంట్ చేశారు.  
Related image
అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం తమకు అలాంటి ఛేదు అనుభవం ఎదురు కాలేదని అన్నారు.  తాజాగా  ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్‌ సభ్యుడి హోదాలో ఉన్న కేరళ ఎంపీ, ప్రముఖ మలయాళీ నటుడైన ఇన్నోసెంట్‌  మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు . 2014 లో సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఇన్నోసెంట్ ఎంపిగా గెలుపొందారు.  
Actor and MP Innocent. Photo: Official Facebook page
అంతే కాదు మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు కూడా ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా చిత్రపరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌  అంటే సినిమా ఆశ చూపించి లోబర్చుకున్నే పద్దతి ప్రస్తుతం లేదంటూనే..అలాంటి వారు ఉంటే మాత్రం అవకాశాలు ఇస్తామని శారీరక వాంచలు తీర్చుకుంటారన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మలయాళీ చిత్రపరిశ్రమ ప్రస్తుతం చాలా బాగుంది.

గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు  మహిళల పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే అది వెంటనే మీడియాకు తెలిసిపోతుంది.  అందుకే ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. అయితే కొంత మంది చెడు మహిళలు మాత్రం చాన్స్ కోసం ఏ పని చేయడానికైనా రెడీ అవుతారని అలాంటి వారి వల్లే చెడ్డపేరు వస్తుందని అన్నారు.  ప్రసుతం ఇన్నోసెంట్‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: