తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాని ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరోగా మారారు.  తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాకపోయినా ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రం తర్వాత నటుడిగా మంచి పేరు సంపాదించాడు.  మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోవ్’ చిత్రం తర్వాత నానికి గోల్డెన్ టైమ్ మొదలైంది.  ఆ తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిమాన్, మజ్నూ, నేను లోకల్ సినిమాలతో వరుస విజయాలు సాధించి స్టార్ హీరో హోదా సంపాదించాడు.
Image result for ninnu kori stills
 ఇప్పుడు ఇండస్ట్రీలో నాని సినిమా అంటే భారీ అంచనాలు పెరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో ఈ రోజు ‘నిన్నుకోరి’ చిత్రం రిలీజ్ అయ్యింది.  సినిమాలో ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రేమ, బ్రేకప్ తో నడిచినట్లు..తర్వాత నాని, ఆది, నివేద ల మద్య వచ్చే సన్నివేశాలు కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్ తో చాలా అద్భుతంగా వచ్చిందని వీక్షకులు అంటున్నారు.  సినిమా ఈ రోజు ప్రిమియర్ షో చూసిన ప్రేక్షకులు సినిమా పై రక రకాల అభిప్రాయాలు చెబుతున్నారు.  సినిమా కాస్త  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యా రాయ్ , అజయ్ దేవ్ గన్ ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం '' హమ్ దిల్ దే చుకే సనమ్ '' తలపించేలా ఉందని అంటున్నారు.
Image result for ninnu kori stills
 బాలీవుడ్ లో 18 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ , కాగా అదే సినిమాని మొత్తంగా కాపీ కొట్టారని సినిమా చూసిన వాళ్లే చెబుతున్నారు. ముగ్గురి మద్య సాగే లవ్ స్టోరీస్ ఇప్పటికే చాలా వచ్చినా సినిమాలో మాత్రం కొత్తతనంగా చూపించారని అంటున్నారు.  సినిమా పై సగటు ప్రేక్షకులు ఏమంటారో రేపటి వరకు వేచి చూడాల్సిందే. 

Image result for ninnu kori stills


మరింత సమాచారం తెలుసుకోండి: