రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా విలనీజం చూపించాడు..తెలుగు సినీ నటుడు ఫిష్‌వెంకట్‌.  దీంతో ఫిష్ వెంక‌ట్‌పై భ‌ద్రాద్రి జిల్లా కొత్త‌గూడెం పోలీసు స్టేష‌న్లో కేసు న‌మోదైంది.  గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో విల‌న్ ప‌క్క‌న చిన్న చిన్న వేషాల్లో క‌నిపించే న‌టుడు ఫిష్ వెంక‌ట్‌ మద్యం తాగి నానా గొడవ చేస్తూ ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు.  కొత్త‌గూడెంలోని ఏ ప‌వ‌ర్‌హౌజ్ ప్రాంతంలో నివాస‌ముండే త‌న కుమార్తె ఇంటి ప‌క్క‌న ఉండే వేముల ప్ర‌సాద్‌, ఉపేంద్ర‌, రాజేశ్‌లపై ఫిష్ వెంక‌ట్ దాడి చేయ‌బోయాడు.

వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి మద్యంతాగి గొడవ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఆయనను పిలిపించి సున్నితంగా మందలించి వదిలేశారు. సినిమాల్లో విలన్‌ పక్కన చిన్నచిన్న వేషాలు వేసే నటుడు వెంకట్‌కు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గొడవ తీవ్రరూపం...
తన కూతురు కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీకి చెందిన మెడికల్‌షాపు లో పనిచేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. అప్పుడప్పుడూ తన కూతురు వద్దకు వెళ్లే ఫిష్ వెంకట్..వారి ఇంటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేంద్ర, వేముల ప్రసాద్‌‌లతో వివాదం ఏర్పడింది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చింది. అది పోలీసుల దాకా వెళ్లింది.  
మరోసారి మందలించి...
వన్‌టౌన్‌ పోలీసులు పలు మార్లు అయనకు సర్థి చెబుతూ ఉన్న తన తీరు మార్చుకోకుండా తాను సినిమా నటుడిని అని తనకు పెద్ద పెద్ద వాళ్లు తెలుసని మీ అంతు చూస్తా అని వేముల ప్ర‌సాద్‌, ఉపేంద్ర‌, రాజేశ్‌లపై ఫిష్ వెంక‌ట్ దాడి చేయ‌బోయాడు.  దీంతో వారు  పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: