బాలీవుడ్ లో తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకున్నారు షారూఖ్ ఖాన్.  బుల్లితెరపై సర్కస్ అనే సీరియల్ లో నటించి విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారారు.  ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన షారూఖ్ ఒక్క నటుడిగానే కాకుండా వ్యాపార వేత్తగా, యాంకర్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.

 తాజాగా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రం ప్రమోషన్ కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్రచారం చేశారు.  ఆ మద్య బస్సులు సర్కస్ విన్యాసాలు చేసిన షారూఖ్ ఇప్పుడు ఏకంగా పొలంలో ట్రాక్టర్ తో కనిపించాడు.  తన సినిమా ప్రమోషన్ లో బాగంగా పంజాబ్‌లోని లుథియానాలో షారుఖ్‌ ట్రాక్టర్ నడిపించాడు.   షారుఖ్ ఇలా ట్రాక్టర్‌ను నడిపిస్తూ పోజులివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పంట పొలాల మధ్య నుంచి ట్రాక్ట‌ర్ న‌డిపించి తన అభిమానుల‌కు హాయ్ చెబుతూ ఆక‌ర్షించాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న అనుష్క శ‌ర్మ పాల్గొంటోంది.  ఏది ఏమైనా తమ సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడంలో సెపరేటు రూటును పాటించే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మరోసారి ఔరా అనిపించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: