సినిమా ఇండస్ట్రీలో 90వ దశకంలో తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా రెచ్చిపోయిన నటించి కుర్రకారు మతులు పోగొట్టిన హీరోయిన్ కస్తూరి.  గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కస్తూరి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది.  ఆ మద్య మళియాళ నటి భావన పై లైంగిక వేదింపులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొంత మంది నటీమణులు ఇండస్ట్రీలో కొంత మంది దర్శక, నిర్మాతలు తమను లైంగికంగా వాడుకోవాలని చూసినట్లు బహిరంగంగానే తమ గోడు వెల్లబుచ్చారు.  

ఇక కస్తూరి ఏకంగా ఓ హీరో తనను పక్కలోకి రావాలని కోరినట్లు అందుకు తాను నో చెప్పడంతో సినిమా చాన్సులు లేకుండా చేసినట్లు చెప్పింది.  ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.  తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది.  ఈ సారి కమల్ హాసన్ కి బాసటగా నిలుస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు.

రీసెంట్ గా తమిళంలో ‘బిగ్ బాస్ ’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ త‌మిళ నాడు విలువ‌ల‌కి వ్య‌తిరేఖంగా వెళుతున్నాడ‌ని హిందూ మక్కల్ కట్చి ఆరోపిస్తుంది.  ఈ మేరకు షో నిర్వాహకులు, కమల్‌హాసన్‌‌లపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే కస్తూరి ఈ విషయంపై స్పందిస్తూ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు.

            చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్..!
‘‘ముందు.. సంస్కృతి పేరు చెప్పుకొని రెచ్చిపోతున్న ‘సాంస్కృతిక అతివాదులు’ నుంచి తమిళ సంస్కృతిని కాపాడండి.‘హిందూత్వం అనేది ఎవడో ఒకడి సొత్తు కాదు’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.‘‘కమల్ హాసన్‌ను, బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేయడం ఎందుకు..? ఇప్పటికే వారంతా 100 రోజుల పాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు కదా. మరి, వాళ్లు ఆ షో నిర్వహిస్తున్న విజయ్ టీవీ మీద కేసు వేస్తారా..?’’ అంటూ మరో ట్వీట్ చేశారు. 

కస్తూరీ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: