టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీ గత 35 ఏళ్లుగా అనేక సినిమాలలో నటించిన నేపధ్యం తెలిసిందే. ఎన్ని చిత్రాల్లో నటించామన్న దృష్టితో కాకుండా ఎన్ని మంచి పాత్రల్లో నటించామన్న ఆలోచనతోనే బెనర్జీ సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన కెరియర్ కొనసాగిస్తూ తనకంటూ  ఏర్పరుచుకున్న ప్రత్యేకమైన ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు. ఈ విలక్షణ నటుడు నటించిన రక్తం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ చిత్రానికి ‘బంగారుతల్లి ఫేం’ రాజేశ్ దర్శకుడు ఈ సినిమా రిలీజ్‌కు ముందే విమర్శకలు ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులకు ఎంపిక అవుతున్న విషయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ మెగా స్టార్ చిరంజీవి పై ఆసక్తికర  కామెంట్స్ చేసాడు బెనర్జీ.  

కమ్యూనిస్టు భావాలతో ఉండే బెనర్జీ డైరెక్టర్ కావాలని భావించి అది కుదరక పోవడంతో  ఇప్పటివరకు 360 కి పైగా చిత్రాల్లోనటించాడు. ఇదే సందర్భంలో మెగా స్టార్ చిరంజీవి గురించి మాట్లుడుతూ చిరంజీవి వ్యక్తిత్యం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఏదైనా సాధించాలన్న తపనతో తన కెరియర్ తొలినాళ్ళలో  పరితపించిన చిరంజీవిని చూసి చాలా స్పూర్తిని పొందిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

అదే మెగా స్టార్ లోని తనకు నచ్చిన విషయం అని చెపుతూ చిరంజీవి జీవితం పై ఎవరైనా ఒక బయోపిక్ ను తీస్తే అది గొప్ప సినిమా అవుతుందని కామెంట్ చేసాడు బెనర్జీ. సాధారణ వ్యక్తిగా సినిమా రంగంలోకి ప్రవేసించి ఒక మెగా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితాన్ని సినిమాగా తీయవలసిన అవసరం ఉందని కామెంట్ చేసాడు ఈ విలక్షణ నటుడు. 

అంతేకాదు అవకాశం ఇస్తే తాను చిరంజీవి జీవితం పై సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు బెనర్జీ. అయితే తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నందమూరి తారకరామారావు జీవితం పై సినిమా ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియని పరిస్థుతులలో చిరంజీవి జీవితం పై బెనర్జీ చేత ఈ సాహసం ఇప్పుడు ఎవరు చేయించగలరు అన్నదే ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: