తెలుగు బుల్లితెర‌పై అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ.  ఇందులో ఇప్పటి వరకు ఎంతో మంది మంది ఔత్సాహిక కళాకారులు ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే ఎక్కువ ఇమేజ్ సంపాదించారు. అంతే కాదు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ కమెడియన్లు గా మారిపోయారు. ఇతర ప్రోగ్రాంల‌లో కూడా సందడి చేస్తున్నారు.  ప్రస్తుతం జబర్దస్త్‌ను షేక్‌ చేస్తున్న కమెడియన్‌ హైపర్‌ ఆది. ఈయన స్కిట్‌లకు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతున్నారు. ఆయన స్కిట్‌ మొత్తం పంచ్‌లే.
Image result for Hyper aadi
ప్రస్తుతం జబర్దస్త్‌కు మంచి పాపులారిటీ రావడంలో హైపర్‌ ఆది కూడా కీలక పాత్ర పోషించాడు.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందరినీ నవ్వించే ఆది జబర్ధస్త్ నుంచి తొలగిస్తారట. ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గతంలో తనను ఆడ వేశం వేయమని చెబితే..అవసరమైతే తాను జబర్ధస్త్ వదిలేస్తా కానీ ఆడవేశం వేయనని మేనేజ్ మెంట్ కి తేల్చి చెప్పాడు.
Related image
ఒక్క హైపర్‌ ఆదిని మాత్రమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్‌లో ఫేమస్‌ అయిన ఏ ఒక్క కమెడియన్‌ను కూడా ఉండనివ్వరని తెలుస్తోంది. ప్రస్తుతం మంచి క్రేజ్‌ ఉన్న కమెడియన్స్‌కు ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అదే కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తే తక్కువ రెమ్యూనరేషన్‌ ఇవ్వడంతో పాటు, కొత్త వారిని ఎంకరేజ్‌ చేసినట్లుగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
Image result for Hyper aadi
మరో మూడు నాలుగు వారాల్లో కొత్త జబర్దస్త్‌ను, కొత్త కామెడీని చూడటం ఖాయం అంటూ జబర్దస్త్‌ నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు.అయితే కొత్తగా వచ్చే వారు ఆ స్థాయిలో ఆకట్టుకుంటారా అనేది అనుమానమేన‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: