ఈ మాటలు అంటుంది ఎవరో కాదు విశ్వనటుడు కమల్ హాసన్.  బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో నటించినప్పటికీ ఎక్కువ తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయ్యారు.   కమల్ హాసన్ సినిమా పరంగా ఎంతో గొప్ప నటుడు కానీ ఆయన వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో వొడిదుడుకులు అనుభవించారు. కమల్ మూడున్నర యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు.
Image result for kamal hassan daughters
కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగించారు.  ప్రస్తుతం గౌతమితో కూడా విడిపోయినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  అయితే కమల్ కూతుళ్లు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
Image result for kamal hassan daughters
పెద్దకూతురు శృతి హాసన్ ఇప్పటికే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరు సంపాదించింది. ఇక చిన్న కూతురు అక్షర హాసన్ కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచన్, ధనుష్ తో కలిసి షమితాబ్ అనే చిత్రంలో నటించింది.  ప్రస్తుతం అజిత్, కాజల్ నటిస్తున్న ‘వివేగం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.  ఈ సినిమా ప్రమోషన్ లో తాను బౌద్ద మతం స్వీకరించినట్లు తెలిపింది.  
Image result for kamal hassan daughters
దీనిపై స్పందించిన కమల్ హాసన్  హాయ్ అక్షు. నువ్వు మతం మార్చుకున్నావా? నువ్వు మతం మారినా సరే నాకు నువ్వంటే ఇష్టమే. మతంతో సంబంధంలేని ప్రేమ నిస్వార్ధమైనదని నేను నమ్ముతాను. నీ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ్. ప్రేమతో మీ బాపు అని కమల్ ట్వీట్ చేశాడు.  అయితే దీనికి వెంటనే స్పందించిన అక్షర...  హాయ్ నాన్న, మానవ జీవన మార్గం, గమ్యాన్ని బోధించే బౌద్ధ మతాన్ని నేను అంగీకరిస్తున్నా. అయినా ఇప్పటికీ నేను నాస్తికురాలినే అంటూ కమల్ కి రీ ట్వీట్ చేసింది అక్షర.


మరింత సమాచారం తెలుసుకోండి: