‘ఫిదా’ విడుదలై 11 రోజులు దాటిపోయినా ఈసినిమా మ్యానియా మన తెలుగు రాష్ట్రాలానే కాకుండా ఓవర్సీస్ ను కూడ ఒక సునామీలా ఇంకా షేక్ చేస్తూనే ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ బిజినెస్ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ ఇప్పటి వరకు 53 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 1.62 మిలియన్ డాలర్లు కలక్షన్స్ వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి కూడ ఈసినిమా ఓవర్సీస్ కలక్షన్స్ హవా కొనసాగుతున్న నేపధ్యంలో ఈమూవీ ఖచ్చితంగా 2 మిలియన్ డాలర్లను టచ్ చేయడం ఖాయం అని అంటున్నారు. 

దీనితో ఓవర్సీస్ కలక్షన్స్ లో మూడవ స్థానంలో ఉండి 1.66 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రికార్డులను మరొక రెండు రోజులలో ‘ఫిదా క్రాస్ చేయడం ఖాయం అని అంటున్నారు. అంతేకాదు ఈ వీకెండ్ పూర్తి అయ్యే సరికి పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ ఓవర్సీస్ కలక్షన్స్ ఫిగర్ 1.89 డాలర్లను కొల్లగొట్టడం ఖాయం అని అంటున్నారు. 

దీనితో మెగా కుటుంబానికి సంబంధించి ఓవర్సీస్ కలక్షన్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ఓవర్సీస్ రికార్డ్ 2.44 మిలియన్ డాలర్ల తరువాత మెగా కుటుంబ హీరోలకు సంబంధించిన ఓవర్సీస్ రికార్డులలో రెండవ స్థానాన్ని అందుకోబోతున్న హీరోగా వరుణ్ తేజ్ మారబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వాస్తవ రూపం దాలిస్తే ఓవర్సీస్ కలక్షన్స్ లో రికార్డులను బ్రేక్ చేద్దామని ప్రయత్నించి భంగ పడ్డ అల్లు అర్జున్ రామ్ చరణ్ లకు షాకింగ్ న్యూస్ అనుకోవాలి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: