అకిరా నందన్ పవన్‌ కళ్యాణ్‌ వారసుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అంటూ పవన్ అభిమానులు కలలు కంటున్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే అటువంటి అకిరా నందన్ ను పవన్ వీరాభిమానులు సైతం పట్టించుకాకపోవడం రేణు దేశాయ్ కి అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే పవన్ తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ నిర్మాతగా దర్శకురాలిగా మారి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ఈమె ఆమధ్య తీసిన  'ఇష్క్‌వాలా లవ్‌" సినిమాలో అకిరా నందన్ చిన్న అతిథి పాత్ర చేసాడు. 

ఈమూవీని తెలుగులోకి విడుదల చేయాలని ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా అది కుదరక పోఅవడంతో ఒక ప్రముఖ ఛానల్ లో ఈసినిమా విడుదల కాకుండానే ప్రీమియర్ షోగా ప్రసారం చేసారు. అయితే అక్కడ కూడ ఆసినిమాను ఎవరు పట్టించుకోలేదు. 

ఇక చేసేది లేక ఈమూవీని పవన్ అభిమానులు బాగా చూస్తారు అన్న ఉద్దేశ్యంతో రేణు దేశాయ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. అయితే ఇక్కడ కూడ రేణు దేశాయ్ కి ఎదురీత తప్పలేదు. ఈసినిమాను అప్ లోడ్ చేసి మూడు రో జులు అవుతున్నా ఇంతవరకు పదివేల వ్యూస్‌ కూడా రాక పోవటం మరీ దారుణం అంటూ రేణు దేశాయ్ బాధ పడుతున్నట్లు టాక్. 

లక్షలాది సంఖ్యలో ఉన్న పవన్ అభిమానులు కనీసం అకిరా నందన్ ఎలా నటించాడు అని చూడతానికైనా ఉత్సాహం చూపెట్టి ఉంటే ఈ పాటికి ఈమూవీకి లక్షల సంఖ్యలో వ్యూస్ వచేవి కదా అని రేణు దేశాయ్ బాధపడుతున్నట్లు టాక్. ఆమధ్య ఎయిర్ పోర్ట్ లో పవన్ వెనక నడుస్తున్న అకిరా హైట్ ను చూసి అకిరా పవన్ ను మించి పోయాడు అని కామెంట్స్ చేసుకున్న పవన్ వీరాభిమానులు ఇప్పుడు కనీసం యూట్యూబ్ లో అకిరా నందన్ నటించిన సినిమా కనిపిస్తున్నా పట్టించుకాకపోవడం ఆశ్చర్య పడవలసిన విషయమే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: