సినిమా ఇండస్ట్రీలో అంటే ఎంతో గౌరవంగా చూస్తారు..ఆదరిస్తారు ప్రేక్షకులు.  అలాంటి ప్రేక్షకులు, అభిమానుల మనసు గాయపడేలా మాట్లాడితే ఉక్కుపాతర వేస్తారని ఇప్పటికే ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.  ఆ మద్య అక్కినేని నాగచైతన్య, రకూల్ ప్రిత్ సింగ్ నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓ లేడీ యాంకర్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని సినిమా గురించి ప్రశ్నలడిగే క్రమంలో  చలపతిరావుని అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని ప్రశ్నించింది.
Image result for chalapathi rao vulgar comment
దీనికి అమ్మాయిలు హానికరం కాదు కానీ...పక్కలోకి పనికొస్తారు .. కామెంట్ చేశారు. అంతే ఆ వ్యాఖ్యలు దావానంలా వ్యాపించాయి..సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  ఓ వైపు సినిమా ఇండస్ట్రీ మరో వైపు మహిళా సంఘాలు ఈ వ్యాఖ్యల్ని ఖండించాయి.  అంత సీనియర్ నటుడు అయివుండి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ మహిళాలోకం ప్రశ్నించింది. దీంతో పలు చానల్స్ లో చలపతిరావు బహిరంగ క్షమాపణలు కోరారు.
Image result for chalapathi rao vulgar comment womens
కాగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ నటుడు చలపతిరావుపై మహిళా సం ఘాల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌, చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసు పై మహిళా సంఘాలు ఇప్పటికీ సిరియస్ గానే ఉన్నారు.  ప్రస్తుతం చలపతిరావు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో నివాసముంటుండటంతో చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసును ఇక్కడకు బదిలీ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: