క్రియేటివ్ దర్శకుడిగా పేరు గాంచిన హను రాఘవ పూడి తన తొలి సినిమా ‘అందాల రాక్షసి’ తోనే తన ప్రతిభను నిరూపించుకున్న ఆసినిమాను జనరంజకంగా తీర్చిదిద్దలేకపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనికితోడు హను ఒక దశ వరకు సినిమా బాగానే  తీస్తాడు కాని ఆతరువాత  అతడి  ట్రాక్ తప్పుతుంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. 

ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో ఒక దశ దాటాక సినిమా అదోలా తయారవుతుంది చివరికి వచ్చేసరికి ప్రేక్షకులకు డిస్కనెక్ట్ అయిపోతుంది అనే విమర్శలు కూడ ఇతడి దర్శకత్వ ప్రతిభ పై ఉన్నాయి. అదే విధంగా  హను రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సంగతి తీసుకున్నా ప్రథమార్ధమంతా చక్కటి ప్రేమకథతో ఆహ్లాదంగా సాగితే ఇంటర్వెల్ దగ్గర నుండి సినిమా పతాక స్థాయిని అందుకుని ఆమూవీ ద్వితీయార్ధంలో పూర్తిగా ట్రాక్ తప్పి నిరాసపరిచింది అనే విమర్శలు కూడ వచ్చాయి.  

హను తొలి రెండు సినిమాలు చూసిన చాలా మంది అతను సగం వరకే సినిమాలు బాగా తీస్తాడని మిగతా సగం సరిగాతీయడు అని కామెంట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ‘లై’ విషయంలో ఏమి  జరుగబోతోందనినితిన్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్.   

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలోనూ ప్రథమార్ధం వినోదాత్మకంగా సరదాగా సాగిపోతుందని అయితే  ద్వితీయార్ధంలో హీరో విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ గా ఈమూవీ సీరియస్ గా  సాగుతుంది అని అంటున్నారు. దీనితో రేపు విడుదలకాబోతున్న ‘లై’ కేవలం మల్టీ ప్లెక్స్  ప్రేక్షకులు మెచ్చే సినిమాగా మారుతుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

దీనికితోడు ఈ సినిమాకు ఏర్పడ్డ విపరీతమైన పోటీ కూడ ఈ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధన అంశంగా మారింది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాకు ఓవర్సీస్ మార్కెట్ లో ఏర్పడ్డ మంచి క్రేజ్ రీత్యా ఈ సినిమాను అమెరికాలో 107 లొకేషన్లలో ప్రీమియర్స్ వెయబోతున్నారు.  మరికొన్ని గంటల్లో యూఎస్ లోని అన్ని ప్రధాన నగరాల్లో 'లై' సినిమా ప్రీమియర్స్ మొదలు అవుతున్న నేపధ్యంలో ఈమూవీ టాక్ ఈ రాత్రికే తెలిసిపోయే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: