నిన్న విడుదల అయిన ‘జయ జానకి నాయక’  మూవీకి సగటు ప్రేక్షకుడు అందరు ఊహించినట్లుగానే మాస్ సినిమాగా ఓటు వేసాడు. అయితే ఈమూకి ఖర్చు పెట్టిన భారీ బడ్జెట్ మరియు బోయపాటి క్రేజ్ తో ఈమూవీకి మూడు సినిమాల మధ్య పోటీలో కూడ భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే నిన్న ఈ సినిమాను చూస్తున్న వారికి ఒక చోట రాజమౌళి బాహుబలి గుర్తుకు వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి హంసలదీవి ప్రాంతంలో చిత్రీకరించిన సీన్ పూర్తిగా ‘బాహుబలి’ బిగినింగ్ లోని ఒక సీన్ ను చూసినట్లు అనిపించడం షాకింగ్ న్యూస్ గా మారింది.

దర్శకుడు బోయపాటి ఈసినిమాకు సంబంధించి ‘బాహుబలి’ షూట్ చేసిన హంసలదీవి ప్రాంతంలో ఒక భారీ ఫైట్ సీన్ చిత్రీకరించాడు.  ఈమూవీ హీరో బెల్లంకొండ ఈ సినిమాలో విలన్ పాత్రను చేస్తున్న శరత్ కుమార్ తలను నరికివేస్తాడు. అయితే ఈ తల నరికే సీన్ చూసిన వారికి ‘బాహుబలి’ బిగినింగ్ లో మహేంద్ర ‘బాహుబలి’ భల్లాలదేవ కొడుకు అడవి శేషు తల నరికిన సీన్ వెంటానే గుర్తుకు వస్తుంది. 

దర్శకుడు బోయపాటి ఈ సీన్ ను చిత్రీకరించిన పద్ధతి అంతా రాజమౌళి ‘బాహుబలి’ లో చిత్రీక రించిన సీన్ ను పోలి ఉండటంతో బోయపాటి రాజమౌళి టెక్నిక్ ను కాపీ చేసాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 34 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు బోయపాటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిన్నటి రేస్ లో ఈమూవీకి కేవలం యావరేజ్ మార్కులు మాత్రమే పడటంతో ఈ సినిమా ఓవరాల్ గా ఎంత వరకు గట్టేక్కుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: