మహానటి 'సావిత్రి' జీవితంలో ఎన్నో చీకటికోణాలు ఉన్నాయి. హీరోయిన్ గా ఆమె  సంపాదించిన సంపాదన దక్షిణ భారత సినిమారంగంలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ సంపాధించు కోలేదు అన్న వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ఆమె చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో గడిపిందని అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేక దీనమైన స్థితిలో మరణించిందని అనేక కధనాలు ఉన్నాయి. చాలమంది ఈ విషయాలు అన్ని వాస్తవం అని అంటారు. 

అయితే ఈ ప్రచారం అంతా అబద్ధమని  అంటోంది సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి.  తన తల్లి ఏవిధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని ఆమె సంపాదించిన డబ్బుతోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది విజయ చాముండేశ్వరి. తన తల్లి కొంత డబ్బు పోగొట్టుకొన్నమాట నిజమే అయినా ఆర్థిక ఇబ్బందులు మాత్రం లేవు అని అంటూ  తనకు తన సోదరుడికి చాలా డబ్బు తన తల్లి ద్వారా వచ్చింది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.

అంతేకాదు తాము ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా ఉన్నత స్థితిలో బతుకుతున్నామని అంటూ తన తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి మరో రెండు తరాలు గడిపినా తరగనంత ఉందని విజయచాముండేశ్వరి ఇచ్చిన ఈ లేటెస్ట్ ట్విస్ట్ ఇప్పుడు సంచలన న్యూస్ గా మారింది. ఇదే సందర్భంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ  తన తల్లి జీవితంపై తీస్తున్న  ‘మహానటి' సినిమాలో అన్నీ నిజాలే చెబుతారని ఆశిస్తున్నట్లు చాముండేశ్వరి కామెంట్స్ చేసింది. అయితే ప్రచారంలో  ఉన్న కల్పితాలను, పుకార్లు ఈ సినిమాలో ఏమాత్రం చూపెట్టినా తాను  అంగీకరించను అని అంటూ తన తల్లి సావిత్రి జీవితంపై తీస్తున్న సినిమాకు తాను కేవలం  షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చినట్లు ఈమె తెలియచేస్తోంది. 

తనకు 16 ఏళ్ల వయసులో వివాహం చేశారని, తన వివాహానికి రెండేళ్ల ముందు నుండే తన తల్లి  సావిత్రి  తండ్రి  జెమిని గణేషన్ మధ్య విభేదాలు, గొడవలు మొదలయ్యాయన్న విషయాన్ని బయటపెడుతూ తన తల్లితండ్రుల మధ్య ఏర్పడిన  మధ్య గొడవల ప్రభావం తనపై పడకపోయినా ఆప్రభావం తన తమ్ముడి పై పడిన విషయాన్ని తెలియచేసింది. ఒకేసారి సమస్యలు చుట్టుముట్టడంతో ఒత్తిడితో తన తల్లి మద్యానికి బానిస అయిన విషయాన్ని అంగీకరిస్తూ ఆ ఒత్తిడితోనే 19 నెలలు కోమాలో ఉంది ఆమె చనిపోయిన విషయం తెలియక ఇప్పటికీ మీడియా ఏమో ఊహించుకుంటూ అనేక కధనాలు ఇప్పటికీ ప్రచారంలోకి హడావిడి చేయడం తనకు అర్ధం కాని విషయం అని అంటూ సావిత్రి ఆస్తుల వెనుక సీక్రెట్ బయటపెట్టింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: