అజిత్ నటన , యాక్షన్ సీన్స్ , సాంకేతికవర్గంఅజిత్ నటన , యాక్షన్ సీన్స్ , సాంకేతికవర్గంకన్ ఫ్యూజ్ స్క్రీన్ ప్లే , అక్కడక్కడ రొటీన్ గా అనిపించడం

ఏకే (అజిత్ కుమార్) టెర్రరిజం ను రూపుమాపేలా ఎవరికి దొరకని టెర్రరిస్టులను అంతమొందించడమే అతని పని. ఇంటెలిజెన్స్ ధైర్యమే అతని ఆయుధాలు. ఓటమికి ఏమాత్రం తలవంచని ఏకే స్నేహితులంటే ప్రాణం ఇస్తాడు. నలుగురు టీంగా ఉన్న వారి బ్యాచ్ లలో ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్) ఒకరు. నలుగురిని ప్రాణంగా భావిస్తాడు ఏకే. ప్రపంచంలో శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ పేల్చే కోడ్ హ్యాకర్ నటాషా (అక్షరా హాసన్)ను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమంలో ఏకే మాయమవుతాడు. ఏకే అందరు చనిపోయాడని అనుకుంటారు కాని ఏకే తిరిగి వస్తాడు. నమ్మిన స్నేహితులే అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చూపిస్తారు. ఇక అన్నివిధాలుగా దెబ్బతిన్న ఏకే ఎలా ఆ కోడ్ ను సాధించాడు..? ఏకే యుద్ధం ఎలా సాగించాడు..? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది అసలు కథ.  

వివేకం ఇది పక్కా అజిత్ మార్క్ సినిమా అని చెప్పొచ్చు. అజిత్ ను అభిమానించే వారికి పక్కా నచ్చే సినిమా. అజిత్ కూడా వన్ మ్యాన్ షో చేశాడు. యాక్షన్, డైలాగ్స్, స్టైల్ అన్నిటిలో ది బెస్ట్ అనిపించుకున్నాడు అజిత్. జేమ్స్ బాండ్ తరహాలో అజిత్ ను చూపించిన విధానం బాగుంటుంది. ఇక సినిమాలో వివేక్ నటన బాగుంది. అజిత్ వివేక్ ల మధ్య సాగే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక కాజల్ రెగ్యులర్ గానే అనిపిస్తుంది. తన పాత్ర వరకు న్యాయం చేసింది కాజల్. అక్షరా హాసన్ ఉన్నది కొద్దిసేపే అయినా పర్వాలేదు అనిపించుకుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ గా వివేకం మరో లెవల్ కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. సినిమా అంతా ఫారిన్ లొకేషన్స్ లో చేయడం వల్ల సినిమా చాలా రిచ్ గా అనిపిస్తుంది. కెమెరా మన్ పనితనం బాగుంది. అనిరుధ్ మ్యూజిక్ కాస్త కొత్తగా ఉన్నా అంత క్యాచీగా లేకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. రూబెన్ ఎడిటింగ్ పర్వాలేదు అయితే ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. శివ రాసుకున్న కథ కథనాలు కొంతవరకు బాగానే ఉన్నా అవి తెరకెక్కించే విధానంలో తప్పులు దొర్లాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ క్లాస్ లో ఉన్నాయి.  

టీజర్ ట్రైలర్ తో కోలీవుడ్ ని షేక్ చేసిన వివేగం తెలుగులో వివేకంగా రిలీజ్ అయ్యింది. ఓ యాక్షన్ అడ్వెంచరస్ గా సాగిన ఈ సినిమా టెక్నికల్ గా మరో లెవల్ కు తీసుకెళ్లింది. అయితే కథ కథనాలు మాత్రం మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా పంథాలోనే వెళ్లాయి. హీరోని ఎవరు మోసం చేశారు అన్న విషయాలను సాధారణ ఆడియెన్ కూడా కనిపెట్టే రీతిలో కథనం నడుస్తుంది. 

అజిత్ యాక్షన్ కోసం కచ్చితంగా సినిమా చూసేయొచ్చు. ప్రతి సినిమాలో కొత్త ఉత్సాహం నింపే అజిత్ ఈ సినిమా కూడా మొత్తం ఫారిన్ లొకేషన్స్ లో తీసేలా చేశారు. హీరో విలన్ ల మధ్య ఎక్కువ సినిమా నడుస్తుంది. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అన్న భావన కలిగేలా చేస్తాడు దర్శకుడు శివ. హ్యాకర్ నటాషాను కనిపెట్టే విధానంలో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే వర్క్ అవుట్ అయ్యింది.

అయితే ప్రేక్షకులకు మెదడుకు పనిచెప్పే సన్నివేశాలు ఉన్నా ఆ వెంటనే వచ్చే సీన్స్ మళ్లీ మూస పద్ధతిని తలపిస్తాయి. సేఫ్ జోన్ లో వెళ్లాలని చేశారో లేక మరేమో కాని కమర్షియల్ అంశాలతో సినిమా కథను డిస్ట్రబ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు కూడా బాగానే తీశారు. టెక్నికల్ గా చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కాస్త కన్ ఫ్యూజన్ కలిగిస్తాయి. 

మొత్తానికి అజిత్ వివేకం అంచనాలను అందుకోలేదు కాని టెక్నికల్ గా మాత్రం ఇండియన్ సినిమాను ముందుకు తీసుకెళ్లేలా చేసిందని చెప్పొచ్చు. 



Ajith Kumar,Vivek Oberoi,Kajal Agarwal,Akshara Hassan,Siva,Sendhil Thyagarajan,Arjun Thyagarajan,T. G. Thyagarajan,Anirudh Ravichanderఅజిత్ వివేకం.. ఫ్యాన్స్ కు పండుగే..!

మరింత సమాచారం తెలుసుకోండి: