పవన్ అక్టోబర్ నుండి జనం మధ్య తిరుగుతూ తన ప్రత్యక్ష రాజకీయాల వేగాన్ని పెంచుతాను అని స్వయంగా కొంత కాలం క్రితం పవన్ ఒక మీడియా సమావేసంలో తెలియచేసాడు. దీనితో ప్రస్తుతానికి పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ఆఖరి సినిమానా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

అయితే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తరువాత పవన్ తిరిగి యూటర్న్ తీసుకుని మరో సినిమాను అక్టోబర్ నెలాఖరు నుండి సెట్స్ పైకి తీసుకు రావడానికి చాల వేగంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అని అంటున్నారు. 

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఎన్నికల వాతావరణం లేకపోవడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం పై ఇంకా పూర్తిగా నెగిటివ్ అభిప్రాయం ప్రజలలో ఏర్పడలేదు అన్న విషయాన్ని నంద్యాల ఉప ఎన్నిక స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు జనం మధ్యకు వచ్చి తెలుగుదేశ పార్టీ విధానాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా ఫలితం ఉండదు అన్న అభిప్రాయంలో పవన్ ఉన్నట్లు సమాచారం.  

దీనితో అనవసరంగా సమయం వృథా చేసుకోకుండా తాను ఇప్పటికే మైత్రి మూవీస్ సంస్థకు ఇచ్చిన 50 రోజుల కాల్ షీట్స్ ను వెంటనే ఉపయోగించి ఈమూవీ నిర్మాణాన్ని పరుగులు తీయించి జనవరి నెలాఖరుకు ఈమూవీ షూటింగ్ పూర్తి చేయాలని పవన్ తన యాక్షన్ ప్లాన్ మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈసినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మధ్యలో ఈమధ్య లేటెస్ట్ గా బోయపాటి పేరు వినిపిస్తోంది. 

బోయపాటి పవన్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటే దానికి ఎదురు ఉండదు అన్న అభిప్రాయం మైత్రి మూవీస్ సంస్థకు కూడ ఉంది అని గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతానికి జనం మధ్యకు పవన్ వచ్చే ఆలోచనలు విరమించుకుని వీలున్నప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా క్రియాశీలక రాజకీయాలను నడిపించాలని పవన్ లేటెస్ట్ ఆలోచన అని అంటున్నారు. మరి పవన్ అభిప్రాయాలలో భవిష్యత్ లో ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: