ఒకే ఒక్క సినిమా అర్జున్ రెడ్డి తో రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి. ఒక అద్భుతమైన ప్రేమ కథ ని తెరమీద ఆవిష్కరించిన ఆయన తెలుగు యువత మొత్తం ఈ సినిమా వెనక ఎగబడేలా చేసాడు. సందీప్ తో సినిమా చెయ్యడం కోసం ఇప్పుడు పెద్ద హీరోలు సైతం క్యూ కట్టేసే పరిస్థితి ఉంది.


ఇప్పటికే తాను అర్జున్ రెడ్డి స్టొరీ లతో ఎందరో హీరోల దగ్గరకి వెళ్లాను అనీ ఆ హీరోలు మాత్రం ఫస్ట్ సినిమానే ఈ సబ్జెక్ట్ అంటే కష్టం ఏదైనా ఫంకీ సబ్జెక్ట్ తీసి అది హిట్ కొట్టాక దీంతో తీయి అని కోరారు అనీ తనకి ఇష్టం లేక విజయ్ తో వేరే ప్రొడ్యూసర్ లని పెట్టి ఈ సినిమా తీశాను అని చెబుతున్నాడు సందీప్.ఈ సినిమాకి సంబందించిన ఒక ముద్దు సీన్ విడుదల కి ముందరే కాంట్రవర్సీ అయ్యింది కూడా.


ఈ విష‌యంపై కాస్త సీరియెస్‌గా స్పందించాడు సందీప్ రెడ్డి. మీ త‌దుప‌రి సినిమాపై ఈ విమ‌ర్శ‌లు ఎంత వ‌ర‌కూ ప‌నిచేస్తాయి? అని అడిగితే.. ”న‌న్ను ఇక్క‌డ అడ్డుకోవాల‌ని చూస్తే బాలీవుడ్ వెళ్లిపోతా.


హిందీ, భోజ్‌పురి, క‌న్న‌డ‌… ఇలా ఏ భాష‌లో అయినా సినిమాలు తీసుకొంటా. ఇండియాలో బ్యాన్ చేస్తే హాలీవుడ్ వెళ్లిపోతా. ఇంత‌కంటే న‌న్నేం చేయ‌మంటారు. అస‌లు మ‌హిళా సంఘాలు ఇలా ఎందుకు స్పందిస్తున్నాయో అర్థం కావ‌డం లేదు” అంటున్నాడు సందీప్‌. ఈ క‌థ మ‌రో సినిమా క‌థ‌కు కాపీ అన్న వివాదం ఒక‌టి కొత్త‌గా పుట్టుకొచ్చింది. దీనిపై కూడా సందీప్ మాట్లాడ్డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: