మెగా స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను పొందిన చిరంజీవి అంజూ మోడీ సహాయం తీసుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ న్యూస్ గా మారింది. చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సైరా’ మూవీకి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అంజూ మోడీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడానికి ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

చారిత్రాత్మక సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో పేరుగాంచిన అంజూ మోడీ ‘బాజీరావ్ మస్తానీ’ ‘రామ్ లీల’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ 18వ శతాబ్దానికి సంబంధించింది కాబట్టి ఆసినిమాలో అన్ని పాత్రలకు వేసే కాస్ట్యూమ్స్  విషయంలో చాల శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్.

ప్రధమ స్వాతంత్ర్యఉద్యమానికి ముందు నడిచిన ఈసినిమా కథకు సంబంధించిన పాత్రలు వేసుకుని కాస్ట్యూమ్స్ కు సంబంధించి చాల రిసర్చ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 18వ శతాబ్దంలో ఆనాటి ప్రజలు వేసుకునే బట్టల విషయంలో సరైన చారిత్రక ఆధారాలు లేకపోవడంతో అప్పటి తరం వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో చాల లోతైన పరిశోధనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈసినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈమూవీలోని కాస్ట్యూమ్స్ విషయంలో చాల శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ కాస్ట్యూమ్ డిజైనర్ గా అంజూ మోడీ ఎంపిక అయినప్పటికీ ఆమెకు అన్ని విషయాలలో ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా తన సత్తాను చాటుకున్న చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడ అంజూ మోడీకి సహకరిస్తున్నట్లు టాక్. కాస్ట్యూమ్స్ భారీ సెట్టింగ్స్ అదేవిధంగా పవర్ ఫుల్ డైలాగ్స్ ఇలా ఏ విషయంలోనూ తీసిపోని విధంగా రూపొందింపబడుతున్న ‘సైరా’ అంతిమ లక్ష్యం తెలుగు చలన చిత్ర కలక్షన్స్ రికార్డులను తిరగ రాయడం అన్నది సుస్పష్టం..   



మరింత సమాచారం తెలుసుకోండి: