ఫస్ట్ హాఫ్ , ప్రొడక్షన్ వాల్యూస్ఫస్ట్ హాఫ్ , ప్రొడక్షన్ వాల్యూస్రొటీన్ స్టోరీ , స్లో నేరేషన్ , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
అర్జున్ టాలెంట్ ఉన్నా సరే తనకంటూ ఓ డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్ వృత్తి చేస్తుండటంతో స్వచ్చంద్ర సేవ చేస్తుంటారు. ఇక సడెన్ గా పేరెంట్స్ కనిపించకుండా పోయేసరికి అర్జున్ వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అర్జున్ తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయారని తెలుస్తుంది. కాని రిపోర్ట్స్ లో అది యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలని వారిని చంపినట్టుగా తెలుసుకుంటాడు. ఇక వారిని తెలుసుకునే క్రమంలో అర్జున్ విలన్లను టార్గెట్ చేస్తాడు. ఇంతకీ అర్జున్ పేరెంట్స్ ను ఎందుకు చంపారు..? విలన్లపై అర్జున్ ఎలా కసి తీర్చుకున్నాడు అన్నది అసలు కథ. 

అర్జున్ గా నాగ చైతన్య సగటు కుర్రాడిగా నటించి మెప్పించాడు. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న చైతు ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. చైతు పరంగా సినిమాను నిలబెట్టాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా పర్వాలేదు అనిపించుకుంది. మొదటి భాగం కాస్త గ్లామరస్ గా కనిపించిన లావణ్య త్రిపాఠి సెకండ్ హాఫ్ లో మాత్రం రెండు మూడు సీన్లకే అంకితమయ్యింది. ఇక రావు రమేష్, రేవతి ల తమ పాత్రలకు న్యాయం చేశారు. నాయక్ గా శ్రీకాంత్ ఆకట్టుకున్నాడు. అయితే ఇంకా విలన్ పాత్రను సరిగా తీర్చిదిద్దలేదని చెప్పాలి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

యుద్ధం శరణం టెక్నికల్ టీం విషయానికొస్తే దర్శకుడు కృష్ణ కథ పాతదే రాసుకున్నా దానికి కథనం కొత్తగా ట్రై చేశాడు. కాని సినిమా చెప్పడంలో మాత్రం కన్ ఫ్యూజ్ చేశాడు. ఎక్కడ హీరోయిజం ఎలివేట్ అవ్వలేదు. అంతేకాదు సినిమాలో విలన్ పాత్రని సరిగా తీర్చిద్దలేదు. ఇక సంగీతం వివేక్ సాగర్ పర్వాలేదు సాంగ్స్ ఏమో కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. వారాహి చలన చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నాగ చైతన్య మాస్ ఇమేజ్ కోసం చేసే ప్రయత్నంలో యుద్ధం శరణంతో వచ్చాడు. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ ఎప్పటిలానే తల్లిదండ్రులను చంపడానికి కారణమైన విలన్ ను చంపడమే. అయితే ఇదే కథను కాస్త స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కన్ ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టాడు.

ఎమోషనల్ వేలో సాగించిన ఈ సినిమా కథనం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కథ కూడా కొత్తగా ఏమి అనిపించదు. ఇక విలన్ గా శ్రీకాంత్ లాంటి పెద్ద స్టార్ ను పెట్టుకుని ఆయన్ను సరిగా వాడుకోలేదు. కథ కథనాల విషయంలో దర్శకుడు ఏమాత్రం సక్సెస్ కాలేదు.

ఇక ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులు ఊహించేలా రావడం కూడా ఆకట్టుకునేలా ఉండదు. కథనం మాత్రమే చెప్పి చైతుని ఇంప్రెస్ చేసి ఉండొచ్చేమో కాని దాన్ని తెరమీద చూపించిన విధానం మాత్రం సోసోగానే సాగింది. సినిమా ఓవరాల్ గా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడంలో విఫలమైందని చెప్పొచ్చు.
Naga Chaitanya,Lavanya Tripathi,Srikanth,Krishna Marimuthu,Sai Korrapati,Rajani Korrapati,Vivek Sagarయుద్ధం శరణం రొటీన్ రివెంజ్ డ్రామా..!

మరింత సమాచారం తెలుసుకోండి: