తెలుగు ఇండస్ట్రీలోకి షాపింగ్ మాల్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అంజలి తర్వాత జర్నీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్టు చిత్రంతో అచ్చ తెలుగు అమ్మాయిగా ‘ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి’ అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్ తో  ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది.  
Image result for actress anjali
ఆ తర్వాత ఈ అమ్మడికి సినిమా చాన్సులు పెద్దగా రాలేదు..కాకపోతే ‘గీతాంజలి’ చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ అమ్మడు తెలుగు లో కన్నా  తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  మొదటి నుంచి కూడా అంజలి బొద్దుగానే ఉంటుంది. ఈ కారణంగా సీనియర్ హీరోల సరసనే ఆమెకి ఛాన్స్ లు వస్తున్నాయి.  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేశ్ సరసన .. 'డిక్టేటర్'లో బాలకృష్ణ జోడీగా అలరించింది.

ఇక లాభం లేదనుకున్న అంజలి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది..అయితే ఈ అమ్మడు తన ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడినట్లు తెలుస్తుంది.  తన ట్విట్టర్ లో రీసెంట్ గా తీయించుకున్న ఫోటోస్ అప్ లోడ్ చేసింది.  ఇప్పుడు ఆమెను చూసిన వాళ్లు మన అంజలియేనా? అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టవలసిందే. స్లిమ్ గా మారిన అంజలికి తెలుగు నుంచి అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: