తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.  వారసత్వపు హీరోగా వచ్చిన ఎన్టీఆర్ తన ప్రతిభతో తాతకు తగ్గ మనవడిగా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఎన్టీఆర్ ఈ నెల 21 న ‘జై లవ కుశ’ చిత్రంతో మరోసారి అలరించడానికి వస్తున్నాడు.  
Image result for ntr adurs movie stills
ఇప్పటికే  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు కొల్లగొడుతున్నాయి.  అంతే కాదు ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు.  మొట్టమొదటి సారిగా తెలుగులో వస్తున్న పాపులర్ రియాల్టీ షో ‘బిగ్ బాస్ ’ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఏ పాత్రైనా తన స్టైల్ తో మెప్పించగల ఎన్టీఆర్ ఓ పాత్ర చేయాలంటే మాత్రం కాస్త భయపడుతున్నాడట.  
Related image
ఇంతకీ ఆ పాత్ర ఏదీ అనుకుంటున్నారా..! మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అదుర్స్’ చిత్రంలో ఆచారీ పాత్రతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.  ఈ మద్య అదుర్స్ సీక్వెల్ రాబోతుందన్న విషయంపై స్పందిస్తూ..అదుర్స్ సినిమాలో ఆచారి పాత్ర తనకెంతో పేరు తెచ్చిందని..మళ్లీ అలాంటి పాత్ర పోషించాలంటే కాస్త భయంగా ఉందని అంటున్నారు.  ఆ సినిమాలో ఆచారి పాత్ర మాస్టర్ పీస్ అని, మళ్లీ తాను ఆ పాత్రను చేస్తే అంత బాగా చెయ్యగలనా? అన్నదే తన అనుమానమని అన్నాడు.  
Image result for jai lava kusa
ఆ పాత్రను అంత బాగా చేయలేనప్పుడు గతంలో చేసిన దానిని చెడగొట్టకుండా ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డాడు.  ఏది ఏమైనా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయగల సామర్థ్యం ఉన్న ఎన్టీఆర్ అలాంటి పాత్రలో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ తెగ ఉత్సాహ పడుతున్నారు.  కాకపోతే  భవిష్యత్ ను ఎవరూ ఊహించలేమని, అదుర్స్ సీక్వెల్ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: