సినిమా చాన్సుల కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తుంటారు.  ఒక్కసారి చాన్స్ దొరికితే తమ దశతిరుగుతుందని భావించే వారు ఎంతో మంది ఉన్నారు.  ఇక స్టూడియోల వెంట పడిగాపులు కాసే ఔత్సాహికులు ఎంతో మంది ఉన్నారు.  అలాంటి వారి వీక్ పాయింట్ ఆసరగా తీసుకొని కొంత మంది బ్రోకర్లు సినిమా ఇండస్ట్రీలో తమకు పెద్దవాళ్లు తెలుసని బూటకపు మాటలు చెప్పి వారిని మోసం చేస్తుంటారు.  ఇక అమ్మాయిల విషయంలో అయితే మరీ దారుణంగా..వారితో లైంగిక వాంఛ కూడా తీర్చుకోవడమే కాకుండా వారిని వ్యభిచార వృత్తిలోకి దింపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
Image result for Bhojpuri actor  Manoj Pandey arrest
 ఓ నటి ఇలాంటి అకృత్యానికే బలైంది. తనకు సినిమా చాన్సు ఇప్పిస్తానని  భోజ్‌పురి నటుడు మనోజ్‌ పాండే  తనను మోసగించాడని, తనతో అనుబంధం కొనసాగిస్తూనే ఇతర మహిళలతో కూడా అతను సంబంధం పెట్టుకున్నాడని బాధిత నటి ఆరోపించింది.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నటుడిని అరెస్ట్ చేయాలని చూశారు.. విషయం తెలుసుకున్న  మనోజ్ పరార్ అయ్యాడు.  
Image result for Bhojpuri actor  Manoj Pandey arrest
ఈ నేపథ్యంలో  పోలీసులు గాలింపు చేపట్టారు. ఆనాటి నుంచి పరారీలోవున్న మనోజ్‌పాండే.. శుక్రవారం పోలీసులకు చిక్కాడు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను మభ్యపెట్టి మనోజ్‌ మోసం చేశాడని, వారి ముందు తానో పెద్ద స్టార్‌గా అభివర్ణించుకొని.. వారితో స్నేహం పేరిట వలవేసేవాడని, ఇదేవిధంగా తనను కూడా మోసం చేశాడని ఆమె మీడియాతో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: