ఒక హీరోకు వరసగా రెండు మూడు అపజయాలు వస్తే అతడితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు భయపడతారు. అయితే   జయాపజలతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేయడమే కాకుండా వినూత్నమైన  కథలను ఎంచుకుంటూ ఎప్పటికైనా హిట్ కొట్టాలి అన్న పట్టుదలతో నారా రోహిత్ వరసపెట్టి సినిమాలు చేస్తూ    తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తిపుకోసం తాపత్రయ పడుతున్నాడు. 
 
గత కొన్ని సంవత్సరాలుగా నారా రోహిత్ చేస్తున్న  సినిమాలు నిరాశనే మిగిల్చాయి. లేటెస్ట్ గా వచ్చిన కథలో రాజకుమారుడు కూడ అపజయాన్నే అందుకోవడంతో రోహిత్ కెరియర్ పై అనుమానాలు మొదలు అయ్యాయి. దీనితో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని రోహిత్ కొత్త ప్లాన్ ని ఆచరణలో పెట్టాడు. 

త్వరలో విడుదల కాబోతున్న తన ‘బాలకృష్ణుడు’ సినిమాకు ప్రమోషన్స్ ని ఎక్కువగా చేయడానికి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హెల్ప్ తీసుకోబోతున్నాడు.  ఈ రోజు ‘విజయదశమి’ సందర్భంగా  సమంత ద్వారా బాలకృష్ణుడు సినిమా టీజర్ ని లాంచ్ చేయిస్తున్నాడు రోహిత్. అదే విధంగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ వరకు సమంతని కొన్నిసలహాలను అడుగుతున్నాడట రోహిత్. 

సోషల్ మీడియాలో సమంత  బాగా  చురుగ్గా  సందడి చేసే నేపధ్యంలో ‘బాలకృష్ణుడు’ సినిమాను సోషల్ మీడియాద్వారా సమంత చేత  ప్రమోట్ చేయిస్తున్నాడు. బాలకృష్ణుడు సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 

పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో  హీరోయిన్ గా రెజీనా నటిస్తోంది. గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత అదృష్టం అయినా ఈసారి నారా రోహిత్ ను రక్షిస్తుందో లేదో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: