సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఎంతగొప్పగా ప్రమోట్ చేసినా కథా బలం సరిగా లేకుండా ప్రేక్షకులు ఆదరించరని పలు మార్లు రుజువైంది. ఇక చిన్న సినిమాలైనా మంచి కథ బలం ఉంటే తప్పకుండా ఆదరిస్తారని పలు చిత్రాల విషయంలో తెలిసింది.  తాజాగా తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోల హవా కొనసాగుతుంది.  నాని, శర్వానంద్, నిఖిల్, రాజ్ తరుణ్ లతో పాటు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్స్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకున్నాడు దేవరకొండ విజయ్. 

 
అయితే పెళ్లిచూపులు చిత్రంలో ఎంతో కూల్ గా సాఫ్ట్ గా కనిపించిన విజయ్..‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో మాత్రం తన విశ్వరూపం చూపించాడు.  ఈ చిత్రం మంచి హిట్ కావడంతో  ఇతర భాషల్లో కూడా తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికలే బాలీవుడ్ లో రణవీర్ సింగ్, తమిళంలో ధనుష్ తన సొంత బ్యానర్ లో ఆర్యను హీరోగా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. 
Image result for sharwanand mahanubhavudu
తాజాగా ‘మహానుభావుడు’ చిత్రంతో మంచి విజయం అందుకున్న శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన లైఫ్ లో ఓ మంచి సినిమా మిస్ అయ్యానని అన్నాడు.  ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..‘అర్జున్ రెడ్డి’. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కథను ముందుగా తనకు వినిపించారని, కానీ, నటించేందుకు తాను ఒప్పుకోలేదని చెప్పాడు.‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించనందుకు తనకు బాధగా ఉందని హీరో శర్వానంద్ అన్నాడు. 
Image result for arjun reddy
వాస్తవానికి సినిమా చేయాలని అనుకున్నా..ఈ చిత్రానికి నిర్మాత, దర్శకులు ఒక్కరే కావడంతో కాస్త ఆలోచనలో పడ్డానని..ఎందుకంటే నిర్మాత బాధ్యతలు కూడా దర్శకుడిపై పడితే సరిగా న్యాయం చేయలేరని తాను అప్పుడు అనుకున్నానని చెప్పాడు.  తాను మిస్ అయిన ‘అర్జున్ రెడ్డి’ లో  విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడని, ఈ సినిమాను సరైన నటుడే చేశాడని చెప్పిన శర్వానంద్, ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ అని ప్రశంసించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: