తెలుగు ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘దేవదాసు’ చిత్రంలో తన నడుం వొంపులతో కుర్రకారు మనసులు దోచింది గోవా బ్యూటీ ఇలియానా.  తర్వాత అగ్ర హీరోల సరసన నటించి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా ఈ అమ్మడికి బాలీవుడ్ పై మనసు పడింది..దీంతో బాలీవుడ్ కి పయనమైంది. 
Image result for ileana hot pics
ఈ అమ్మడికి బాలీవుడ్ లో ఏమాత్రం కలిసిరాలేదు..దాంతో ఇటు తెలుగులో అటు హిందీలో చాన్స్ లు లేకుండా పోయాయి.  తాజాగా ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరో తెలియదని  షాకింగ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాకపోతే ఇది ఇప్పటి మాట కాదు..తాను తెలుగు ఇండస్ట్రీలోకి  వచ్చిన తొలినాళ్లలో మహేశ్ అంటే ఆమెకు తెలియదు అని ఇలియానానే చెప్పింది. 
Image result for ileana hot pics
దక్షిణ ముంబైలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఇలియానా మాట్లాడుతూ, ఎయిర్‌ హోస్టెస్‌ కావాలన్నది తన చిన్ననాటి కల అని, ఎయిర్ హోస్టెస్ అయితే ఉచితంగా ప్రపంచాన్ని చుట్టేయొచ్చని భావించానని తెలిపింది. కానీ అది కుదరలేదు..పోనీ మంచి   ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఉండేది..కానీ సైకాలజీ చదవాలనుకున్నా. ఆ తర్వాత నా లైఫ్ మరో రకంగా టర్నింగ్ అయ్యింది.

నా 16 యేటనే చిత్ర పరిశ్రమకు  రావడం..తొలి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘పోకిరి’ చిత్రంతో నా ఇమేజ్ ఒక్కసారే పెరిగిపోయింది.  అయితే ఆ సమయానికి నాకు మహేష్ బాబు అంటే ఎవరో తెలియదని చెప్పింది గోవా బ్యూటీ.  సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి నాకు చాలా టైమ్ పట్టిందని..అలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇండస్ట్రీలో గొప్పతనం తెలిసిందని అంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: