దర్శకధీరుడు రాజమౌళి నేడు 43 సంవత్సరాలు పూర్తిచేసుకొని 44వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా జన్మ దిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "ట్విటర్" ద్వారా దిగ్దర్శకుడు రాజమౌళికి శుభాకాంక్షలు అందజేశారు. ఆయన తన ట్వీట్ లో "తెలుగు ఫిల్మ్ మేకర్ దిగ్గజానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తూ ఉండాలి." అని ట్వీట్ చేశారు. 

Image result for rajamauli birthday today


విజ్ఞానానికి, నాయకత్వానికి కణాచిగా నిలిచిన రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సర్వదా ప్రశాంతంగా సంతోషం ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రాజమాత శివగామి దటీజ్.... రమ్యకృష్ణ ట్వీట్ చేశారు. బాహుబలి మూవీ యూనిట్ కూడా ఎంతో ఆనందంగా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాజమౌళి అభిమాన గణం  అయితే తమ రకరకాల ఫోటోలు, పోస్టర్లతో శుభాకాంక్షలు వెల్లువలా శుభాకాంక్షలు పంపిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి'  హీరోయిన్ షాలిని పాండే రాజమౌళి కి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారి జాబితాలో ఇప్పటికే ఉన్నారు. 

Related image


ఇప్పటికే బాహుబలి-2 టెలివిజన్ ప్రసారం పై  అద్భుతమైన టిఆర్పిలు సాధించినందుకు గర్వపడని తెలుగువాడు సారీ! భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి ఉండ దనుకుంటా?   


ఈ సందర్భంగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు ఆపై విశ్వ చిత్ర రంగానికి స్వయం కృషితో ఎదిగిన విశ్వవిజేత "యస్ యస్ రాజమౌళి గారికి" జన్మదిన శుభాకాంక్షలు" చెపుతుంది ఏపి హెరాల్డ్ సగర్వంగా. 

Image result for ramyakrishna birthday wishes to rajamauli

మరింత సమాచారం తెలుసుకోండి: