తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు త్రిష.   వర్షం చిత్రంతో ప్రభాస్ సరసన నటించి ఈ అమ్మడు తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.   ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు దాటినా ఇప్పటికీ గ్లామర్ క్విన్ గా కనిపిస్తుంది. అంతే కాదు ఇప్పటి అప్ కమింగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా పోటీగా నిలుస్తున్న నిషాకళ్ల సుందరి త్రిష. 
Image result for garjanai tamil movie
ఇప్పటికీ జీరో సైజ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు ఉంటుంది. అంతగా ఫిజిక్‌ను మెయింటైన్‌ చేసే ఈ చెన్నై సుందరి తాజాగా మరింత స్లిమ్‌గా మారింది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. 34 ఏళ్లు దాటినా టీనేజ్‌ గర్ల్‌గా కనిపిస్తూ  ఓ సెల్ఫీతో అందరి మతులు పోగొట్టింది.   ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ‘గర్జనై’ తమిళ చిత్రంలో నటిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ‘ఎన్‌హెచ్‌7’కు రీమేక్‌గా రూపొందుతున్న ‘గర్జనై’లో త్రిష యాక్షన్‌ పాత్ర ఉండటంతో జిమ్‌లో ప్రతిరోజూ గంటల తరబడి గడుపుతోందని అంటున్నారు. అలా జిమ్‌లో ఉండగా తీసుకున్న ఓ సెల్ఫీ  తీసుకొని పోస్ట్ చేసింది.  ఇంకేముంది..అసలే అందాల సుందరి.. హీట్ గా సెల్ఫీ పోస్ట్ చేయడంతో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: