భారతీయ చరిత్రలో వీర శృంగార రసాలను పొంగి పొర్లించిన వీరగాధలెన్నో.  వెతికి వెతికి పట్టుకొని మరీ 13-14 శతాబ్ధాల కాలం నాటి  చిత్రకూట్ (చిత్తుర్) రాజవంశ వీర చరిత్రను తెరకెక్కించే దర్శకుడు సామాన్యుడు మాత్రం కాదు. "రాం లీల, బాజీరావ్ మస్తాని" అనే అద్భుత వీరగాధను నిర్మించిన చైతన్యం, దేవదాస్ లాంటి సృజనాత్మక చిత్రం సృష్టించిన సృజన, ఇదే ర‌ణ్‌ వీర్ సింగ్, దీపికా పదుకొనే ల కలయికలో ఇప్పటికే రెండు విజయవంతమైన చారిత్రాత్మక సినిమాలు నిర్మించిన అనుభవం, ఎవరి నుండి ఎంత నటనను ఎలా రాబట్టుకోవాలో తెలిసిన దిగ్ధర్శకుడు..... ఆయనే సంజయ్ లీలా బన్సాలి. 

Image result for padmavati movie images and rajamouli

       
బాహుబలి స్థాయిలో తెరకెక్కిస్తూ అనేక సినిమాలు బాలీవుడ్ లో తయారౌతున్నాయి. రాజ్‌పుత్‌ మ‌హారాణి రాని పద్మినిగా మనం పిలుచుకునే ప‌ద్మావ‌తి క‌థ‌తో విలక్షణ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ప‌ద్మావ‌తి` సినిమా ట్రైల‌ర్ నిన్న అంగరంగ వైభవంగా విడుద‌లైన సంగతి పాఠకులకు తెలిసిందే.


ఇప్ప‌టికే ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకునే, ఆమె భ‌ర్త రావ‌ల్ ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ క‌పూర్‌, అల్లా వుద్దీన్ ఖిల్జీగా ర‌ణ్‌వీర్ సింగ్‌ల ఫ‌స్ట్‌లుక్‌లు విడుదలై సినిమాపై భారీ అంచ‌నా లను పెంచేశాయి. నిన్న విడుద‌లైన ట్రైల‌ర్‌లో వారి ఆహార్యాభిన‌యాలు ఆ అంచ‌నాలను రెట్టింపు చేశాయి.  ట్రైల‌ర్‌లో చూపించిన భారీ సెట్టింగులు, యుద్ధ స‌న్నివేశాలు మరింత ఆస‌క్తిని పెంచు తున్నాయి. రాజ్‌పుత్ వంశ‌స్థుల ఖ్యాతిని వివ‌రిస్తూ ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ చివ‌ర్లో ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకునే చెప్పిన...... 



"రాజ్‌పుత్‌ల ఖ‌డ్గంలో ఎంత శ‌క్తి ఉందో... అంతే శ‌క్తి రాజ్‌పుత్ రాణుల గాజుల్లో కూడా ఉంటుంది" అనే డైలాగ్ ఆ ట్రైలరు కు  
హైలైట్‌గా నిలిచింది. 

Image result for padmavati movie images and rajamouli


అల్లావుద్దీన్ ఖిల్జీ గా ర‌ణ్‌వీర్ సింగ్‌ని చూపించిన విధానం కూడా అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది.  "కామాతురాణం నభయం న లజ్జ"  అన్నట్లు రాణి కోసం  భయానక, కౄర,  కర్కశ, రౌద్ర రూపములో రణవీర్ సింగ్ నటన దిగ్భ్రమ గొలుపుతూ ఉంది.


డిసెంబ‌ర్ 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకి రానున్న ఈ సినిమా లో సంజయ్ లీలా బన్సాలీ తరహా గ్రాండ్‌ విజువలైజేషన్‌.. అత్యున్నతమైన సాంకేతిక విలువల తో అమోఘమైన నటీనటులతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా ప్రతిసృష్టి చేస్తూ సినిమా మలిచినట్టు ట్రైలర్‌ చెపుతుంది. 


ఈ ట్రైలర్‌లో అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌ వీర్‌ సింగ్‌ భయానక,  రౌద్రం తో కూడిన నటన అనితర సాధ్యమా!  అన్నట్లు ఆకట్టు కోగా.. అతనితో హోరా హోరీగా వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్‌ క‌పూర్‌ ధీర గంభీరత, అభినయం, దీపికా ప‌దుకునే నటన ముగ్ధ, మనోహర, మరీ ముచ్చట గొలిపేలా ఉన్న ఆమె సౌందర్యం ఈ ట్రైలర్‌లో ప్రసంశనీయంగా ఉంది. 


ఈ ట్రైలర్ పై ఇప్పటికే సినీ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. "పిచ్చి ఎక్కించేంత అందంగా ఉంది. ఇందులోని ప్రతీ ఫ్రేమ్ ని ఎంతో నైపుణ్యంతో దర్శకుడు తెర కెక్కించారు" అని పద్మావతి ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.


Image result for rani padmavati images

మరింత సమాచారం తెలుసుకోండి: