పవన్ కళ్యాన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ప్రతిభను గుర్తించి అవకాశం ఇవ్వడంలో ముందు ఉంటాడు. తన సినిమా విజయం లో కీలక పాత్ర పోషించిన వారిని తగిన విధంగా గౌరవించడం పవన్ అలవాటు. అత్తారింటి కి దారేది....ఇంకా విడుదల కాకపోయినా ఆ సినిమా పై చాలా నమ్మకంతో వున్నాడు పవన్.

అందుకే ముందే సంబరాలు చేసుకుంటున్నాడు. తన టీం కి చిన్న చిన్న కానుకలు ఇచ్చి ఖుషీ చేస్తున్నాడు. ఆ కానుకలలో ఓ ఖరీదైన కారు కూడా వుంది. అయితే అది ఎవరికీ అనేది సస్పెన్స్. త్రివిక్రమ్, సమంత లలో ఒకరికి ఈ కారు బహుమానంగా ఇచ్చే అవకాశం వుందట.

త్రివిక్రమ్ కి ఇస్తే పరవాలేదు. అదే... సమంత కి ఇస్తే ఆ ప్రమోషనే వేరుగా వుంటుంది. మరి పవన్ ఆ అవకాశం ఇస్తాడో ? లేడో ? 'అత్తారింటికి దారేది' ఆగష్టు 7 న విడుదల కాబోతుంది. ఇంతలోపల ఈ సస్పెన్స్ కి తెర దించుతే చాల బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: