యాంకర్ శ్రీముఖి తన క్యూట్ యాంకరింగ్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాల్లో కూడా అడపాదడపా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తుంది. బుల్లితెర మీద తనదైన ముద్ర వేసుకున్న శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పై ఆ ఇమేజ్ కోసం బాగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక అందుకే అమ్మడు ఓ క్రేజీ మూవీలో నటించేస్తుంది.


నటుడు, రచయిత హర్షవర్ధన్ డైరక్షన్ లో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె చాలా హాట్ గా ఉంది. శ్రీముఖికి ఎందుకు ఈ సరదా బుల్లితెర మీద ఉన్న ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఇంత దిగజారుడు సినిమాలు అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.


ఇక కొందరు శ్రీముఖి చేసే ఓవర్ యాక్షన్ అయితే శ్రీముఖి ఈ పాత్ర పర్ఫెక్ట్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకులు ఎలాగైనా రిసీవ్ చేసుకోవాలన్న ఆలోచనతో శ్రీముఖి ఇంత బోల్డ్ అటెంప్ట్ చేసింది. అమ్మడు హాఫ్ సారీ లో అందాలు అదరగొడుతుందని చెప్పొచ్చు. శ్రీముఖిలో హాట్ యాంగిల్ చూడాలని కోరుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


సినిమా టీజర్ అయితే ఏదో విషయం ఉన్నట్టు ఉంది. ఇక సినిమాలో మెయిన్ వర్మను హైలెట్ చేసినట్టుగా ఉన్నాడు. వర్మ పాత్రకు ఓ ఆర్టిస్టుని కూడా పెట్టారు. మొత్తానికి హర్షవర్ధన్ చేస్తున్నా ఈ తొలి దర్శకత్వపు ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: