మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా మొదలైన సైరా సినిమా ఇంకా ఒరిజినల్ షూటింగ్ మొదలు అవ్వకపోవడం తో మెగా ఫాన్స్ తో పాటు చిత్ర పరిశ్రమ లో కూడా చాలా నెగెటివ్ మాటలు వినపడుతూ ఉన్నాయి. మెగా ఫాన్స్ ఒకపక్క రోజూ ట్విట్టర్ ఫేస్ బుక్ లో రామ్ చరణ్ కీ అతని కొణిదెల ప్రొడక్షన్ బృందానికీ మెసేజ్ లు పెడుతూ ఉండగా దీపావళి కంటే ముందర ముహూర్తాలు లేకపోవడం వల్లనే టైం లేట్ అయ్యింది అని అంటున్నారు కొందరు.

మ‌రోవైపు సెట్స్ కూడా సిద్దం కాలేదు. స్వాతంత్ర్యోద్య‌మం కాలంనాటి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా సెట్స్‌ని రూపొందించాల్సి వ‌చ్చింది. అందుకోసం కాస్త రీసెర్చ్ కూడా చేయాల్సివుంది. కాస్ట్యూమ్స్, ఆయుధాల రూప‌క‌ల్ప‌న వీటి కోసంఎక్క‌వ స‌మ‌యం కేటాయించారు. అందుకే `సైరా` సైర‌న్ మోగ‌డానికి టైమ్ ప‌ట్టింది.

ఇప్పుడు ఇవ‌న్నీ రెడీ అయిపోయాయి. ఇక చిరుదే ఆల‌స్యం. దీపావ‌ళి పండుగ చేసుకొని, మ‌రుస‌టి రోజు షూటింగ్ మొద‌లెట్టాల‌ని చిత్ర‌బృందం భావించింది. అంటే..ఈ రోజే క్లాప్ కొట్టాల‌న్న‌మాట‌. అయితే చిరంజీవి నుంచీ ఇంకా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. చిరు ఖైదీ సినిమా టైం కి కాస్త బరువు తగ్గి సన్నబడ్డారు కానీ ప్రస్తుతం కాస్త లావుగా కనపడుతున్నారు.

సో కొన్ని వారాల నుంచీ కొనసాగుతున్న డైట్ తో పాటు ఆయన స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ మరొక కొన్ని వారాల్లో బరువు తగ్గేలా ఉన్నారు. సైరా పాత్రకు త‌గ్గ‌ట్టు జుట్టు కూడా భారీగా పెంచుతున్నారట. సైరా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ని తాను మ‌ల‌చుకొన్న త‌రువాత‌…సైరా సెట్లో అడుగుపెడ‌తార‌ట చిరంజీవి. 


మరింత సమాచారం తెలుసుకోండి: