రామ్, అనుపమ, శ్రీవిష్ణు, మ్యూజిక్, ఫస్ట్ హాఫ్రామ్, అనుపమ, శ్రీవిష్ణు, మ్యూజిక్, ఫస్ట్ హాఫ్సెకండ్ హాఫ్ ల్యాగ్, ఊహించిన క్లైమాక్స్
అభి (రామ్) చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం వల్ల ఆ టైంలో పరిచయమైన ఫ్రెండ్ వాసు (శ్రీవిష్ణు) ప్రాణంగా భావిస్తాడు. అభి, వాసు ఇద్దరు ఏ పని చేసినా కలిసి చేస్తూ సరదాగా ఉంటారు. ఇలాంటి టైంలో అభి కి దూరంగా వెళ్తాడు వాసు ఇంతలోనే అభికి మహా (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. అభిని మహా.. మహాని అభి ప్రేమించుకునే సమయంలో తిరిగి వచ్చిన వాసు అభికి షాక్ ఇస్తాడు. మహా వాసు వాళ్ల మామయ్య కూతురే.. ఆమెను పెళ్లాడాలని అనుకుంటారు. ఈ సమయంలో అభి, వాసు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మహాకి తెలుస్తుంది. అభి, వాసు ఇద్దరు మహాకి ప్రపోజ్ చేసి డెశిషన్ ఆమెకే వదిలేస్తారు. ఇంతకీ మహా ఎవరికి ఓకే చెప్పింది..? అభి, వాసుల ఫ్రెండ్ షిప్ అలానే ఉంటుందా..? అన్నది తెర మీద చూడాలి.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తనకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథను ఎంచుకున్నాడు. అభిగా రామ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. రాక్ స్టార్ గా రామ్ స్టైలిష్ యాక్షన్ ఆకట్టుకుంది. ఇక వాసుగా నటించిన శ్రీవిష్ణు కూడా అలరించాడు. హీరోతో సమానంగా ఉన్న పాత్రతో శ్రీవిష్ణు తన వరకు ఒకే అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్స్ అనుపమ, లావణ్య ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మొదటి భాగం మొత్తం కుర్రాల్ల హృదయాలను దోచేస్తుంది అనుపమ. అభి, మహాల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఫ్రెండ్స్ గా నటించిన అందరు బాగా మెప్పించారు. ప్రియదర్శి కామెడీ ఆకట్టుకుంది. 

కిశోర్ తిరుమల మరోసారి తన పెన్ పవర్ చూపించాడని చెప్పొచ్చు. స్నేహం, ప్రేమ ఈ రెండిటి మధ్య ప్రేక్షకులను బాగా అలరించాడు. సినిమాలో దేవి మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అది కాస్త ట్రిం చేసుంటే బాగుండేది. డైలాగ్స్ విషయంలో మెచ్చుకోవాల్సిందే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడం ఒకరు కోసం ఒకరు త్యాగం చేయడం.. ఈ కథ ఎక్కడో విన్నట్టు ఉంటుంది. అయితే ఉన్నది ఒకటే జిందగిలో ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేయడం మాత్రం ఎక్కడ చూసుండరు. సినిమాలో కొన్ని అంశాలు అదిరిపోయేలా ఉన్నాయి. మొదటి భాగం అంతా మహా, అభిల లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. ఇక స్నేహానికి సంబందించిన డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.


మహా వాసుని ఇష్టపడిన టైంలో అతని అభిని నెగ్లెక్ట్ చేయడం ఫ్రెండ్స్ తో కలవకపోవడం అంతా ఒకేలా ఉన్నా వారిద్దరిని కలిపిన అభి మదర్ చనిపోయిన రోజు గుర్తులేకపోవడం అన్నది లాజిక్ గా అనిపించదు. ఓ ఇద్దరు చిన్న నాటి స్నేహితులు ఎలా ఉండాలో చూపించాడు దర్శకుడు కిశోర్ తిరుమల.  


సినిమాలో కొన్ని సీన్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. సినిమా యూత్ ఆడియెన్స్ ను నచ్చే అంశాలతో బాగా తీశారు. రామ్ కిశోర్ తిరుమల కాంబోలో వచ్చిన నేను శైలజ మ్యాజిక్ రిపీట్ చేస్తూ ఉన్నది ఒకటే జిందగి కూడా హిట్ కొట్టినట్టే. 
Ram Pothineni,Anupama Parameswaran,Lavanya Tripathi,Kishore Tirumala,Krishna Chaitanya,Sravanthi Ravi Kishore,Devi Sri Prasadఉన్నది ఒకటే జిందగి రామ్ హిట్ కొట్టేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: