ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా మారారు. అలనాటి చిత్రాల్లో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి వారు కమెడియన్లుగా నటిస్తూనే..కొన్ని చిత్రాల్లో హీరోలుగా నటించి మెప్పించారు. ఈ తరం విషయానికి వస్తే..బ్రహ్మానందం, ఆలి లాంటి వారు కమెడియన్లుగా చేస్తూనే హీరోలుగా నటించారు.  అయితే కమెడియన్ సునీల్ మాత్రం అందాల రాముడు చిత్రంతో హీరోగా మారి మళ్లీ కామెడీ పాత్రలు వేయలేదు. ప్రస్తుతం కమెడిన్ గా నటిస్తున్న  శ్రీనివాస్ రెడ్డి .. సప్తగిరి హీరోలుగా మారిపోయారు.
Image result for షకలక శంకర్
ఒక వైపు కమెడియన్ గా చేస్తూనే హీరోగా వస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.  తాజాగా వీరి బాటలోనే నడుస్తున్నాడు జబర్ధస్త షకలక శంకర్. కొంత కాలంగా ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన కమెడియన్ గా షకలక శంకర్ కి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మిమిక్రీతో, అనుకరణ కళతో కమేడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న షకలక శంకర్ ‘జబర్ధస్త్’ షో తో బాగా పాపులర్ అయ్యాడు. 
Image result for షకలక శంకర్
ఆ తర్వాత వెండి తెరపై చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇప్పుడు కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇండస్ట్రీలో  హాస్యనటుడిగా కెరీర్ ఆరంభించి.. ఫుల్ లెంగ్త్ హీరోలం అయిపోదామని ప్రయత్నించిన వాళ్లు పెద్దగా సక్సెస్ కాలేదు. 
Image result for షకలక శంకర్
ఇక షకలక శంకర్  ‘డ్రైవర్ రాముడు’ పేరుతో రూపొందే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రాజు - కిషన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాజ్ సత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'డ్రైవర్ రాముడు'గా ఎన్టీఆర్ స్టైల్లో .. షకలక శంకర్ ఆకట్టుకుంటున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: